Macherla Niyojakavargam day 1 Collections.. నితిన్ మూవీకి ఊహించని వసూళ్లు.. ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?
యువ హీరో నితిన్, కృతిశెట్టి, క్యాథరీన్ త్రెసా నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు సినిమా పరిశ్రమలో ఎడిటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఎస్ఆర్ శేఖర్ (ఎస్ రాజశేఖర్ రెడ్డి) దర్శకుడిగా మారి ఈ సినిమాను అందించారు. మాస్ అంశాలు, కమర్షియల్ వ్యాల్యూస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే?

మాచర్ల ప్రీ రిలీజ్ బిజినెస్
మాచర్ల నియోజకవర్గం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 6 కోట్లు, సీడెడ్‌లో 3 కోట్లు, ఆంధ్రాలో 10 కోట్లతో కలిపి మొత్తంగా 19 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్ళో 1 కోటి, ఓవర్సీస్‌లో 1.2 కోట్ల మేర బిజినెస్ చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 21.2 కోట్లకుపైగా బిజినెస్ నమోదు చేసింది.

అమెరికాలో ప్రీమియర్స్ క్యాన్సిల్
అమెరికాలో బుధవారం రాత్రి ప్రీమియర్స్ షోలు ప్రదర్శించాల్సింది. అయితే సాంకేతిక కారణాల వల్ల షోలు రద్దు అయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. మాచర్ల నియోజకవర్గం చిత్రం 108 లొకేషన్లనలో 180 షోల ద్వారా 36K అమెరికన్ డాలర్లు అంటే.. 29 లక్షల రూపాయలను వసూలు చేసింది.

హైదరాబాద్‌లో ఓపెన్సింగ్స్ ఇలా..
హైదరాబాద్‌లో మాచర్ల నియోజకవర్గం సినిమాకు మోస్తారు ఓపెనింగ్స్ నమోదయ్యాయి. నగరంలో మొత్తంగా 349 షోలు ప్రదర్శించారు. 21 శాతం అక్యుపెన్సీతో ఈ చిత్రం 50 లక్షల రూపాయలు తొలి రోజు రాబట్టింది. చివరి లెక్కల వరకు ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా అంచనా
మాచర్ల నియోజకవర్గం సినిమా తొలి ఆట తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమా బుకింగ్‌పై కొంత ప్రభావం చూపించింది. అయితే ఫస్ట్, సెకండ్ షోలకు భారీ స్పందన ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు 3.5 కోట్ల మేర ఉండే అవకాశం ఉంది. అంతా సవ్యంగా సాగితే.. ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మేర వసూళ్లు నమోదు చేయడానికి స్కోప్ ఉంది.

మాచర్ల నియోజకవర్గం లాభాల్లోకి రావాలంటే?
మాచర్ల నియోజకవర్గం సినిమా జరిపిన బిజినెస్ ప్రకారం ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే.. కనీసం 22 కోట్ల రూపాయల బిజినెస్ చేయాల్సి ఉంది. లాంగ్ వీకెండ్ కారణంగా ఈ సినిమాకు బీ, సీ సెంటర్లలో పాజిటివ్ బజ్ ఏర్పడితే బాక్సాఫీస్ టార్గెట్ ఈజీ అయ్యే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











