Macherla Niyojakavargam day 2 Collections.. అంచనాలను మించి నితిన్ హవా.. రెండో రోజు వసూళ్లు ఎంతంటే?
యువ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రం రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ట్రేడ్ అనలిస్టుల అంచనాలను తలకిందులు చేస్తూ భారీ వసూళ్లను సాధిస్తున్నది. తొలి రోజు భారీగా వసూళ్లను నమోదు చేసిన ఈ చిత్రం రెండో రోజు కూడా ఇతర చిత్రాల నుంచి పోటీని అధిగమించి వసూళ్లను రాబడుతున్నది. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం 2వ రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే..

రెండో రోజు కూడా అదే జోష్
మాచర్ల నియోజకవర్గం చిత్రం నైజాంలో మంచి వసూళ్లను రాబడుతున్నది. తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా 4.96 కోట్ల షేర్, 10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. అదే ఊపును రెండో రోజును కూడా కొనసాగించే ప్రయత్నం చేసింది. బీ,సీ సెంటర్లలో మంచి వసూళ్లు కురిపించింది. మాస్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్స్ వస్తున్నది.

ఆంధ్రాలో వసూళ్లు
ఆంధ్రా విషయానికి వస్తే.. తూర్పు గోదావరి జిల్లాలో 6 లక్షల షేర్‌ను రాబట్టింది. భీమవరం టౌన్‌లోనే 1.69 లక్షల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక కృష్ణా జిల్లాలో 10 లక్షల షేర్‌ను నమోదు చేసింది. అనంతపురం జిల్లాలో 3 లక్షల షేర్ రాబట్టింది. కర్నూలు సిటీలో 2.41 లక్షల షేర్ రాబట్టింది.

నైజాంలో రెండో రోజు
నైజాం విషయానికి వస్తే తొలి రోజున 1.43 కోట్లు సాధించించిన ఈ చిత్రం రెండో రోజున 1.18 కోట్ల వసూళ్లను సాధించింది. ఖమ్మంలో 1.3 లక్షలు, హైదరాబాద్‌లో భారీగా వసూళ్లను సాధించింది. వరంగల్, కరీంనగర్, నిజమాబాద్‌లో భారీ వసూళ్లను రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు
ట్రేడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 3.25 కోట్ల షేర్ సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. బాక్సాఫీస్ వద్ద సీతారామం, బింబిసార, కార్తీకేయ 2 చిత్రాల పోటీని తట్టుకొని ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడం మాస్ కంటెంట్ వల్లే సాధ్యమైందని అభిప్రాయపడుతున్నారు.

బ్రేక్ ఈవెన్ సాధించాలంటే..
మాచర్ల నియోజకవర్గం ప్రపంచవ్యాప్తంగా 21.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా 22 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. తొలి రోజు 4.69 షేర్, 10 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. రెండో రోజున 3.25 షేర్, 6.5 కోట్ల షేర్ సాధించినట్టు సమాచారం. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా కనీసం 14 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











