Macherla Niyojakavargam Collections: 22 కోట్ల బిజినెస్.. వారంలో ఘోరంగా.. ఇంకెన్ని కోట్లు రావాలంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ తనదైన కథలతో ప్రేక్షకులను అలరిస్తోన్న హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. అయితే, 'భీష్మ' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం నితిన్ వేచి చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న కసితో ఇటీవలే 'మాచర్ల నియోజకవర్గం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీకి టాక్‌ మాత్రం అనుకున్నట్లుగా రాలేదు. దీంతో కలెక్షన్లు కూడా ఆశించిన రీతిలో వసూలు కావట్లేదు. ఈ నేపథ్యంలో 'మాచర్ల నియోజకవర్గం' వారం రోజుల రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

మాచర్ల నియోజకవర్గంలో నితిన్

మాచర్ల నియోజకవర్గంలో నితిన్

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి రూపొందించిన చిత్రమే 'మాచర్ల నియోజకవర్గం'. ఈ సినిమాలో కృతి శెట్టి, కేథరిన్ హీరోయిన్లు. దీనికి మహతీ స్వర సాగర్ సంగీతం ఇచ్చాడు. ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

నితిన్ సినిమా బిజినెస్ డీటేల్స్

నితిన్ సినిమా బిజినెస్ డీటేల్స్

నితిన్ మార్కెట్‌ ప్రకారమే 'మాచర్ల నియోజకవర్గం' మూవీ హక్కులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 6 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి రూ. 21.20 కోట్ల బిజినెస్ అయింది.

7వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

7వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

నితిన్ హీరోగా నటించిన 'మాచర్ల నియోజకవర్గం' మూవీ ఎన్నో అంచనాలతో విడుదలైంది. కానీ, దీనికి అనుకున్న రీతిలో స్పందన దక్కడం లేదు. దీంతో కలెక్షన్లు క్రమంగా పడిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో రెస్పాన్స్ తగ్గుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 7వ రోజైన గురువారం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 14 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్ వచ్చింది.

7 రోజులకు కలిపి ఎంతొచ్చింది

7 రోజులకు కలిపి ఎంతొచ్చింది

వారం రోజుల్లో 'మాచర్ల నియోజకవర్గం'కు ఏపీ, తెలంగాణలో వసూళ్లు తక్కువే వచ్చాయి. నైజాంలో రూ. 3.07 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.45 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.24 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 83 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 39 లక్షలు, గుంటూరులో రూ. 90 లక్షలు, కృష్ణాలో రూ. 65 లక్షలు, నెల్లూరులో రూ. 44 లక్షలతో.. రూ. 8.97 కోట్లు షేర్, రూ. 14.35 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

యూత్ స్టార్ నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' మూవీకి ఏపీ, తెలంగాణలో వారం రోజుల్లో రూ. 8.97 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 44 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 40 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఏడు రోజులకు ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.81 కోట్లు షేర్‌తో పాటు రూ. 16.55 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజులకు దీనికి రూ. 9.81 కోట్లు వచ్చాయి. అంటే మరో 12.19 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

వారంలో ఇంతే.. నష్టాలు తప్పవా

వారంలో ఇంతే.. నష్టాలు తప్పవా

పూర్తి స్థాయి మాస్ కథతో వచ్చిన 'మాచర్ల నియోజకవర్గం' మూవీకి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రానికి రెస్పాన్స్ భారీగానే వచ్చింది. అయితే, వీక్ డేస్‌లో మాత్రం ఈ సినిమాకు వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. దీంతో వారంలో దీనికి సగం వసూళ్లు కూడా రాలేదు. దీనిబట్టి చూస్తే ఈ సినిమాకు నష్టాలు వచ్చే ప్రమాదం కనిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X