Macherla Niyojakavargam Collections: 6వ రోజే మరీ ఇంత తక్కువా.. ఇదేం దారుణం సామీ!
సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తోన్న హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే భారీ హిట్లను సొంతం చేసుకున్న అతడు.. స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే, మధ్యలో చాలా కాలం పాటు ఫ్లాపుల పరంపరతో ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' అనే సినిమాతో వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీకి టాక్ మాత్రం అనుకున్నట్లుగా రాలేదు. అలాగే, కలెక్షన్లూ క్రమంగా పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలో 'మాచర్ల నియోజకవర్గం' 6 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

మాచర్ల నియోజకవర్గం అంటూ
టాలెంటెడ్ హీరో నితిన్ - ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి కలయికలో వచ్చిన చిత్రమే 'మాచర్ల నియోజకవర్గం'. ఈ సినిమాలో కృతి శెట్టి, కేథరిన్ హీరోయిన్లు. ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దీనికి మహతీ స్వర సాగర్ సంగీతం ఇచ్చాడు.

నితిన్ సినిమా బిజినెస్ డీటేల్స్
నితిన్ మార్కెట్ అనుగునంగానే 'మాచర్ల నియోజకవర్గం' మూవీ హక్కులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 6 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి రూ. 21.20 కోట్ల బిజినెస్ జరిగింది.

6వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది
'మాచర్ల నియోజకవర్గం'కు 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 7 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 40 వేలు, గుంటూరులో రూ. 60 వేలు, కృష్ణాలో రూ. 1.60 లక్షలు, నెల్లూరులో రూ. 40 వేలతో.. రూ. 18 లక్షలు షేర్, రూ. 35 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

6 రోజులకు కలిపి ఎంతొచ్చింది
6 రోజుల్లో 'మాచర్ల నియోజకవర్గం'కు ఏపీ, తెలంగాణలో వసూళ్లు తక్కువగానే వచ్చాయి. నైజాంలో రూ. 3.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.43 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.22 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 83 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 38 లక్షలు, గుంటూరులో రూ. 88 లక్షలు, కృష్ణాలో రూ. 64 లక్షలు, నెల్లూరులో రూ. 44 లక్షలతో.. రూ. 8.83 కోట్లు షేర్, రూ. 14.10 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా
నితిన్ హీరోగా నటించిన 'మాచర్ల నియోజకవర్గం' మూవీకి ఏపీ, తెలంగాణలో 6 రోజుల్లో రూ. 8.83 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 43 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 39 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఆరు రోజులకు ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.65 కోట్లు షేర్‌తో పాటు రూ. 16.25 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?
నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22 కోట్లుగా నమోదైంది. ఇక, ఆరు రోజులకు దీనికి రూ. 9.65 కోట్లు వచ్చాయి. అంటే మరో 12.35 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

సగం కంటే తక్కువగా కలెక్షన్లు
ఫుల్ లెంగ్త్ మాస్ స్టోరీతో వచ్చిన 'మాచర్ల నియోజకవర్గం' మూవీకి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రానికి రెస్పాన్స్ భారీగానే వచ్చింది. అయితే, వీక్ డేస్‌లో మాత్రం ఈ సినిమాకు వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. మరీ ముఖ్యంగా 6వ రోజుల దీనికి ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ. 20 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. ఇది చాలా తక్కువనే చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications











