Macherla Niyojakavargam Collections: నితిన్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఇలా అయితే అన్ని కోట్ల నష్టాలే
దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలతో ప్రత్యేకతను చాటుకుంటూ అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ అయిన హీరో యూత్ స్టార్ నితిన్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్‌ను సైతం భారీగా పెంచుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'మాచర్ల నియోజకవర్గం' అనే సినిమాతో వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి టాక్ మాత్రం అనుకున్నట్లుగా రాలేదు. దీంతో కలెక్షన్లు కూడా క్రమంగా పడిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'మాచర్ల నియోజకవర్గం' 8 రోజుల రిపోర్టును మీరే చూడండి!

మాచర్ల నియోజకవర్గంతో ఎంట్రీ
యూత్ స్టార్ నితిన్ హీరోగా ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రమే 'మాచర్ల నియోజకవర్గం'. ఈ సినిమాలో కృతి శెట్టి, కేథరిన్ హీరోయిన్లు. ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దీనికి మహతీ స్వర సాగర్ సంగీతం అందించాడు.

నితిన్ సినిమా బిజినెస్ డీటేల్స్
నితిన్ మార్కెట్‌కు అనుగుణంగా 'మాచర్ల నియోజకవర్గం' మూవీ హక్కులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 6 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి రూ. 21.20 కోట్ల బిజినెస్ జరిగింది.

8వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది
నితిన్ నటించిన మాస్ మూవీ 'మాచర్ల నియోజకవర్గం' భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ, దీనికి అనుకున్న రీతిలో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ రావడం లేదు. దీంతో కలెక్షన్లు క్రమంగా పడిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 8వ రోజు ఈ సినిమాకు కేవలం రూ. 10 లక్షలు షేర్, రూ. 20 లక్షలు గ్రాస్ వచ్చింది.

8 రోజులకు కలిపి ఎంతొచ్చింది
8 రోజుల్లో 'మాచర్ల నియోజకవర్గం'కు ఏపీ, తెలంగాణలో వసూళ్లు తక్కువే వచ్చాయి. నైజాంలో రూ. 3.11 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.47 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.25 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 84 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 39 లక్షలు, గుంటూరులో రూ. 91 లక్షలు, కృష్ణాలో రూ. 66 లక్షలు, నెల్లూరులో రూ. 44 లక్షలతో.. రూ. 9.07 కోట్లు షేర్, రూ. 14.55 కోట్లు గ్రాస్ మాత్రమే దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా
నితిన్ హీరోగా నటించిన 'మాచర్ల నియోజకవర్గం' మూవీకి ఏపీ, తెలంగాణలో 8 రోజుల్లో రూ. 9.07 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 45 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 41 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఎనిమిది రోజులకు ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.93 కోట్లు షేర్‌తో పాటు రూ. 16.85 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?
నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22 కోట్లుగా నమోదైంది. ఇక, ఎనిమిది రోజులకు దీనికి రూ. 9.93 కోట్లు వచ్చాయి. అంటే మరో 12.07 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











