Macherla Niyojakavargam Collections: నితిన్‌కు ఊహించని షాక్.. వచ్చిందింతే.. రావాల్సింది మాత్రం!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత మంది హీరోలు మాత్రమే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో యూత్ స్టార్ నితిన్ ఒకడు. 'జయం' అనే సినిమాతో ప్రయాణాన్ని ప్రారంభించిన అతడు.. చాలా కాలం పాటు విజయాలను అందుకున్నాడు. అయితే, మధ్యలో వరుస పరాజయాలతో కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకున్నాడు. తర్వాత మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కి దూసుకెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'మాచర్ల నియోజకవర్గం' అనే సినిమాతో వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి టాక్‌ మాత్రం అనుకున్నట్లుగా రాలేదు. దీంతో కలెక్షన్లు కూడా క్రమంగా పడిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'మాచర్ల నియోజకవర్గం' 9 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

మాచర్ల నియోజకవర్గంలో నితిన్

మాచర్ల నియోజకవర్గంలో నితిన్


యూత్ స్టార్ నితిన్ - ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి కాంబోలో వచ్చిన మాస్ మూవీనే 'మాచర్ల నియోజకవర్గం'. ఈ సినిమాలో కృతి శెట్టి, కేథరిన్ హీరోయిన్లు. దీనికి మహతీ స్వర సాగర్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

నితిన్ సినిమా బిజినెస్ డీటేల్స్

నితిన్ సినిమా బిజినెస్ డీటేల్స్

హీరో నితిన్ మార్కెట్‌‌ ప్రకారమే 'మాచర్ల నియోజకవర్గం' మూవీ హక్కులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 6 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి రూ. 21.20 కోట్ల బిజినెస్ అయింది.

9వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

9వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' మూవీ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, దీనికి అనుకున్న రీతిలో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ రావడం లేదు. దీంతో కలెక్షన్లు క్రమంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 9వ రోజు ఏపీ, తెలంగాణలో కలిపి కేవలం రూ. 12 లక్షలు షేర్, రూ. 20 లక్షలు గ్రాస్ వచ్చింది.

9 రోజులకు కలిపి ఎంతొచ్చింది

9 రోజులకు కలిపి ఎంతొచ్చింది


9 రోజుల్లో 'మాచర్ల నియోజకవర్గం'కు ఏపీ, తెలంగాణలో వసూళ్లు తక్కువే వచ్చాయి. నైజాంలో రూ. 3.17 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.49 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.27 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 85 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 41 లక్షలు, గుంటూరులో రూ. 92 లక్షలు, కృష్ణాలో రూ. 67 లక్షలు, నెల్లూరులో రూ. 45 లక్షలతో.. రూ. 9.22 కోట్లు షేర్, రూ. 14.75 కోట్లు గ్రాస్ మాత్రమే దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

యూత్ స్టార్ నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' మూవీకి ఏపీ, తెలంగాణలో 9 రోజుల్లో రూ. 9.22 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 46 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 41 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 9 రోజులకు ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.07 కోట్లు షేర్‌తో పాటు రూ. 17.00 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?


క్రేజీ కాంబోలో వచ్చిన 'మాచర్ల నియోజకవర్గం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజులకు దీనికి రూ. 10.07 కోట్లు వచ్చాయి. అంటే మరో 11.93 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X