Macherla Niyojakavargam Collections: నితిన్ మూవీకి షాకింగ్ వసూళ్లు.. నెగెటివ్ టాక్‌తో అన్ని కోట్లా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో యూత్ స్టార్ నితిన్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను సొంతం చేసుకున్న అతడు.. ఆ తర్వాత చాలా కాలం పాటు వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడ్డాడు. అయితే, ఈ మధ్య కాలంలో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. కానీ, దాన్ని కంటిన్యూ చేయలేక సతమతం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా భారీ సక్సెస్‌ను అందుకోవాలన్న లక్ష్యంతో నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' అనే సినిమాతో వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీకి మొదటి రోజు కలెక్షన్లు ఎలా వచ్చాయో మీరే చూడండి!

Recommended Video

వీళ్ల అరుపులకు, అభిమానానికి సలాం సేత్ అంతే *PublicTalk || Telugu OneIndia
 మాచర్ల నియోజకవర్గంతో ఎంట్రీ

మాచర్ల నియోజకవర్గంతో ఎంట్రీ

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ నటించిన తాజా చిత్రమే ‘మాచర్ల నియోజకవర్గం'. ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కృతి శెట్టి, కేథరిన్ హీరోయిన్లు. దీనికి మహతీ స్వర సాగర్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మించారు.

నితిన్ సినిమా బిజినెస్ డీటేల్స్

నితిన్ సినిమా బిజినెస్ డీటేల్స్


నితిన్ మార్కెట్‌కు అనుగుణంగానే ‘మాచర్ల నియోజకవర్గం' మూవీ హక్కులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 6 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి రూ. 21.20 కోట్ల బిజినెస్ జరిగింది.

అలాంటి టాక్... వసూళ్లపై ఎఫెక్ట్

అలాంటి టాక్... వసూళ్లపై ఎఫెక్ట్

ఎన్నో అంచనాల నడుమ రూపొందిన మాస్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం' శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే నెగెటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. దీంతో ఈ సినిమాకు అనుకున్న విధంగా ఓపెనింగ్ డేన కలెక్షన్లు వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు అంచనా వేశారు.

తొలి రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

తొలి రోజు ఎక్కడ? ఎంతొచ్చింది


‘మాచర్ల నియోజకవర్గం'కు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రెస్పాన్స్ బాగా వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.42 కోట్లు, సీడెడ్‌లో రూ. 75 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 68 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 46 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 56 లక్షలు, కృష్ణాలో రూ. 30 లక్షలు, నెల్లూరులో రూ. 26 లక్షలతో.. రూ. 4.62 కోట్లు షేర్, రూ. 7.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం' మూవీకి ఏపీ, తెలంగాణలో మొదటి రోజు రూ. 4.62 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 28 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 25 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 5.15 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 5.15 కోట్లు వచ్చాయి. అంటే మరో 16.85 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

నెగెటివ్ టాక్‌తోనే భారీగా.. రికార్డు

నెగెటివ్ టాక్‌తోనే భారీగా.. రికార్డు


‘మాచర్ల నియోజకవర్గం' మూవీకి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రానికి రెస్పాన్స్ భారీగానే వచ్చింది. అందుకే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 4.62 కోట్లు వసూలు చేసింది. తద్వారా నితిన్ నటించిన రీసెంట్ సినిమాల్లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా (రంగ్ దే కూడా 4.62 కోట్లు రాబట్టింది) ఇది రికార్డు సాధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X