Rang De Day 1 Collections: నితిన్ సినిమాకు ఊహించని కలెక్షన్లు.. మొదటి రోజే ఇలా ఉంటే.. వీకెండ్ ఎలా!

దాదాపు రెండు దశాబ్ధాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్కును చూపిస్తున్నాడు యూత్ స్టార్ నితిన్. సొంత టాలెంట్‌తో కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి జయాపజయాలతో కెరీర్‌ను ముందుకు సాగిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది భారీ పరాజయంతో మొదలు పెట్టి.. ఇప్పుడు 'రంగ్ దే' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడీ యంగ్ హీరో. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందనను అందుకుంది? ఏ రేంజ్ కలెక్షన్లు రాబట్టింది?

 ‘రంగ్ దే' అంటూ ఆమెతో కలిసి వచ్చేశాడు

‘రంగ్ దే' అంటూ ఆమెతో కలిసి వచ్చేశాడు

'చెక్' మూవీతో ఈ ఏడాదిని నిరాశజనకంగా ఆరంభించాడు యూత్ స్టార్ నితిన్. ఇలాంటి పరిస్థితుల్లో 'రంగ్ దే' అనే సినిమా చేశాడు. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 భారీ అంచనాలు.. అనుగుణంగానే బిజినెస్

భారీ అంచనాలు.. అనుగుణంగానే బిజినెస్

పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్‌ల కారణంగా 'రంగ్ దే'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే నైజాంలో ఈ చిత్రం రూ. 7.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.6 కోట్లు, ఆంధ్రాలో రూ. 10 కోట్లతో రెండు రాష్ట్రాల్లో రూ. 21.20 కోట్ల వ్యాపారం జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 23.90 కోట్ల మేర బిజినెస్ నమోదైంది.

గ్రాండ్‌గా విడుదల.. అన్ని చోట్లా పాజిటివ్‌గా

గ్రాండ్‌గా విడుదల.. అన్ని చోట్లా పాజిటివ్‌గా

'రంగ్ దే' మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 800 థియేటర్లలో విడుదల అయింది. ఇది ప్రదర్శితమైన అన్ని ప్రాంతాల్లోనూ మంచి స్పందననే అందుకుంది. అందుకు అనుగుణంగానే టాక్ కూడా మంచిగానే వినిపిస్తోంది. దీనికి తోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. తద్వారా నితిన్ ఖాతాలో మరో హిట్ వచ్చిందని అంటున్నారు. దీంతో చిత్ర యూనిట్ సంబరాలు జరుపుకుంటోంది.

మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది?

మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది?

'రంగ్ దే' మూవీకి మొదటి రోజు టాక్‌కు అనుగుణంగానే కలెక్షన్లు రికార్డు స్థాయిలో వచ్చాయి. నైజాంలో రూ. 1.52 కోట్లు, సీడెడ్‌లో రూ. 59 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 56 లక్షలు, ఈస్ట్‌లో రూ. 52 లక్షలు, వెస్ట్‌లో రూ. 31 లక్షలు, గుంటూరులో రూ. 67 లక్షలు, కృష్ణాలో రూ. 21 లక్షలు, నెల్లూరులో రూ. 24 లక్షలతో రెండు రాష్ట్రాల్లో రూ. 4.62 కోట్లు షేర్, రూ. 6.71 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల ఎంతంటే?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటిన 'రంగ్ దే'.. మిగిలిన ప్రాంతాల్లోనూ మంచి స్పందననే అందుకుంది. ఫలితంగా కలెక్షన్లను కూడా గట్టిగానే రాబట్టింది. ఏపీ తెలంగాణలో కలిపి మొదటి రోజు రూ. 4.62 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 26 లక్షలు, ఓవర్సీస్‌లో 55 లక్షలు కలెక్ట్ చేసింది. దీంతో ఫస్ట్ డే రూ. 5.43 కోట్లు షేర్, రూ. 8.70 కోట్లు గ్రాస్ రాబట్టింది.

 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

ప్రపంచ వ్యాప్తంగా 'రంగ్ దే' బిజినెస్ రూ. 23.90 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 24.50 కోట్లుగా నమోదైంది. ఇక, మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.43 కోట్లు వసూలు అయ్యాయి. దీంతో ఈ చిత్రం క్లీన్ హిట్‌గా నిలవాలంటే మరో రూ. 19.07 కోట్లు కలెక్ట్ చేయాలి. వీకెండ్‌లో ఈ మూవీ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X