Rang De 3 Days Collections: ఆదివారం సత్తా చాటిన ‘రంగ్ దే’.. సరికొత్త రికార్డు.. ఏకంగా రెండో స్థానం
గత ఏడాది లాక్‌డౌన్‌కు ముందే 'భీష్మ'తో భారీ విజయాన్ని అందుకున్నాడు యూత్ స్టార్ నితిన్. అయితే, ఈ సంవత్సరం మాత్రం 'చెక్'లో ఘోరమైన ఆరంభాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల 'రంగ్ దే' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను అందుకుంది. తద్వారా కలెక్షన్లనూ భారీగానే రాబడుతోంది. ఇక, మూడో రోజైన ఆదివారం అదిరిపోయే వసూళ్లతో రికార్డులు క్రియేట్ చేసింది. ఆ సంగతులు మీకోసం!

ఆమెతో కలిసి రంగ్ దే అంటూ వచ్చిన నితిన్
లవ్ స్టోరీల స్పెషలిస్టుగా పేరొందిన దర్శకుడు వెంకీ అట్లూరి. అతడి దర్శకత్వంతో యూత్ స్టార్ నితిన్ నటించిన చిత్రమే 'రంగ్ దే'. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రం గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను అందుకుంది.

వాటితో పెరిగిన అంచనాలు.. బిజినెస్ భారీగా
పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్‌ల కారణంగా 'రంగ్ దే'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే నైజాంలో ఈ చిత్రం రూ. 7.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.6 కోట్లు, ఆంధ్రాలో రూ. 10 కోట్లతో రెండు రాష్ట్రాల్లో రూ. 21.20 కోట్ల వ్యాపారం జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 23.90 కోట్ల మేర బిజినెస్ నమోదైంది.

మూడో రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది?
'రంగ్ దే' మూవీకి మూడో రోజు కలెక్షన్లు మరింత ఎక్కువగా వచ్చాయి. నైజాంలో రూ. 1.24 కోట్లు, సీడెడ్‌లో రూ. 52 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 40 లక్షలు, ఈస్ట్‌లో రూ. 17 లక్షలు, వెస్ట్‌లో రూ. 13 లక్షలు, గుంటూరులో రూ. 16 లక్షలు, కృష్ణాలో రూ. 16.50 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలతో తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం రూ. 2.88 కోట్లు షేర్, రూ. 5 కోట్లు గ్రాస్ వచ్చింది.

మూడు రోజులకు కలిపి ఎంత రాబట్టిందంటే?
'రంగ్ దే' మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 800 థియేటర్లలో విడుదల అయింది. అన్ని ప్రాంతాల్లోనూ మంచి స్పందననే అందుకుంది. అందుకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లను రాబట్టింది. మొదటి రోజు రూ. 4.62 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 2.54 కోట్లు.. మూడో రోజు రూ. 2.88 కోట్లతో మొత్తంగా రూ. 10.04 కోట్లు షేర్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటిన 'రంగ్ దే'.. మిగిలిన ప్రాంతాల్లోనూ మంచి స్పందననే అందుకుంది. ఫలితంగా కలెక్షన్లను కూడా గట్టిగానే రాబట్టింది. ఏపీ తెలంగాణలో మూడు రోజులకు రూ. 10.04 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 60 లక్షలు, ఓవర్సీస్‌లో 1.50 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా రూ. 12.14 కోట్లు షేర్, రూ. 21 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?
ప్రపంచ వ్యాప్తంగా 'రంగ్ దే' బిజినెస్ రూ. 23.90 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 24.50 కోట్లుగా నమోదైంది. ఇక, మూడు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.14 కోట్లు వసూలు అయ్యాయి. దీంతో ఈ చిత్రం క్లీన్ హిట్‌గా నిలవాలంటే మరో రూ. 12.36 కోట్లు కలెక్ట్ చేయాలి. వచ్చే వారం వరకూ పెద్ద సినిమాలు లేకపోవడంతో దీనికి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

‘రంగ్ దే’ సరికొత్త రికార్డు.. ఏకంగా రెండో స్థానం
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ 'రంగ్ దే' మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. తద్వారా ఇప్పటికే 3 లక్షల డాలర్ల మార్కును కూడా చేరుకుంది. దీంతో ఈ ఏడాది విడుదలైన తెలుగు చిత్రాల్లో ఫస్ట్ వీకెండ్‌లోనే ఎక్కువ కలెక్షన్లు అందుకున్న రెండో చిత్రంగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. దీని కంటే ముందు 'జాతి రత్నాలు' సినిమా ఉంది. 'ఉప్పెన' మూడో స్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications











