Rang De 8 Days Collections: మరింత దారుణంగా కలెక్షన్లు.. వాటి వల్ల నితిన్‌కు ఊహించని కష్టాలు!

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకడు. టీనేజ్‌లోనే ఏమాత్రం అంచనాలు లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. తొలినాళ్లలోనే ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. బౌన్స్ బ్యాక్ అయినట్లు ఫామ్‌లోకి వచ్చి.. జయాపజయాలతో సాగుతున్నాడు. ఇలాంటి సమయంలో ఇటీవల 'రంగ్ దే' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హిట్ టాక్‌తో ప్రారంభమైన ఈ సినిమాకు కలెక్షన్లు మాత్రం దారుణంగా వస్తున్నాయి. ఈ మూవీ 8 రోజుల బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!

ఒక హిట్.. ఒక ఫ్లాప్ తర్వాత ‘రంగ్ దే’ రిలీజ్

ఒక హిట్.. ఒక ఫ్లాప్ తర్వాత ‘రంగ్ దే’ రిలీజ్

యూత్ స్టార్ నితిన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'రంగ్ దే'. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు. 'భీష్మ'.. 'చెక్' వంటి ఒక హిట్.. ఒక ఫ్లాప్ తర్వాత.. ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రం గత వారం విడుదలైంది.

వాటితో పెరిగిన అంచనాలు.. బిజినెస్ భారీగా

వాటితో పెరిగిన అంచనాలు.. బిజినెస్ భారీగా

పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్‌ల కారణంగా 'రంగ్ దే'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే నైజాంలో ఈ చిత్రం రూ. 7.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.6 కోట్లు, ఆంధ్రాలో రూ. 10 కోట్లతో రెండు రాష్ట్రాల్లో రూ. 21.20 కోట్ల వ్యాపారం జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 23.90 కోట్ల మేర బిజినెస్ నమోదైంది.

చిరునవ్వే విసిరావే.. ఎవ్లీన్ శర్మ పిక్స్ వైరల్

8వ రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత వచ్చిందంటే?

8వ రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత వచ్చిందంటే?

'రంగ్ దే' మూవీ ఎనిమిదో రోజు కలెక్షన్లు మరింతగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2.20 లక్షలు, నెల్లూరులో రూ. 80 వేలతో తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం రూ. 29 లక్షలు షేర్, రూ. 55 లక్షలు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

ఎనిమిది రోజులకు కలిపి ఎంత మేర రాబట్టింది?

ఎనిమిది రోజులకు కలిపి ఎంత మేర రాబట్టింది?

'రంగ్ దే' ఆరంభంలో ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందననే అందుకున్నా.. కొద్ది రోజులుగా డ్రాప్ అవుతోంది. 1వ రోజు రూ. 4.62 కోట్లు, 2వ రోజు రూ. 2.54 కోట్లు.. 3వ రోజు రూ. 2.88 కోట్లు, 4వ రోజు రూ. 1.51, 5వ రోజు రూ. 73 లక్షలు, 6వ రోజు రూ. 44 లక్షలు 7వ రోజు రూ. 38 లక్షలు, 8వ రోజు రూ. 29 లక్షలతో మొత్తంగా రూ. 13.39 కోట్లు షేర్‌, రూ. 21.65 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల ఎంతంటే?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే 'రంగ్ దే'.. మిగిలిన ప్రాంతాల్లోనూ ఒకే రకమైన స్పందనను అందుకుంది. ఆంధ్రా ప్లస్ తెలంగాణలో ఎనిమిది రోజులకు రూ. 13.10 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 75 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.76 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా 8 రోజులకు రూ. 15.90 కోట్లు షేర్, రూ. 27.62 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

ప్రపంచ వ్యాప్తంగా 'రంగ్ దే' బిజినెస్ రూ. 23.90 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 24.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఎనిమిది రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.90 కోట్లు వసూలు అయ్యాయి. దీంతో ఈ చిత్రం హిట్‌గా నిలవాలంటే మరో రూ. 8.60 కోట్లు కలెక్ట్ చేయాలి. టాక్ బాగున్నా.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం.. కొత్త సినిమాలు రావడం ప్రతికూలంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X