Extra Ordinary Man Collections: 2వ రోజే భారీ దెబ్బ.. మరీ ఇంత తక్కువగా.. ఇంకా అన్ని కోట్లు రావాలా!
కెరీర్ ఆరంభం నుంచీ ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకడు. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న అతడు.. వరుసగా ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాడు.
ఈ క్రమంలోనే తాజాగా నితిన్ 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మిక్స్‌డ్ టాక్ రావడంతో రెస్పాన్స్ ఆశించినట్లుగా రాలేదు. ఫలితంగా ఈ చిత్రం కలెక్షన్లను ఆశించినట్లుగా రాణించడం లేదు. మరి ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రెండు రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి!

నితిన్ ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్‌గా:యూత్ స్టార్ నితిన్ నటించిన తాజా చిత్రమే 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్'. వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డిలు నిర్మించారు. శ్రీలీల హీరోయిన్‌గా చేసిన ఈ మూవీలో రాజశేఖర్ సర్‌ప్రైజింగ్ రోల్ చేశారు. అలాగే, రావు రమేష్, సుదేవ్ నాయర్ తదితరులు నటించారు. హరీష్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

నితిన్ మూవీకి బిజినెస్ ఇలా: 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' చిత్రానికి నైజాంలో రూ. 7.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 9 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 19.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.70 కోట్లు, ఓవర్సీస్ హక్కులు రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 24.20 కోట్లు బిజినెస్ అయింది.

2వ రోజు తెలుగులో వసూళ్లు: నితిన్ - శ్రీలీల జంటగా నటించిన 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీకి మొదటి రోజు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. రెండో రోజు అయితే ఇది మరింతగా డౌన్ అయిపోయింది. దీంతో నైజాంలో రూ. 45 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఆంధ్రా మొత్తంలో కలిపి రూ. 40 లక్షలు రాబట్టింది. ఇలా రెండో రోజు ఈ సినిమా రూ. 94 లక్షలు షేర్, రూ. 1.65 కోట్లు గ్రాస్ రాబట్టింది.

2 రోజులకూ కలిపి ఎంతంటే: ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాకు రెండు రోజుల్లో నిరాశజనకమైన స్పందనే వచ్చింది. ఫలితంగా ఇది నైజాంలో రూ. 1.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 30 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలను కలిపి రూ. 1.10 కోట్లు వసూలు చేసింది. ఇలా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.45 కోట్లు షేర్, రూ. 4.50 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో రూ. 2.45 కోట్లు రాబట్టిన 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఆశించిన రీతిలో స్పందనను అందుకోలేకపోయింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 32 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 35 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపితే 2 రోజుల్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.12 కోట్లు షేర్, రూ. 5.90 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: ఫన్ జోనర్‌లో రూపొందిన 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 3.12 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 21.88 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











