Extra Ordinary Man Collections: నితిన్ ఖేల్ ఖతం.. 5 రోజుల్లో దారుణంగా.. అన్ని కోట్ల నష్టాల దిశగా!
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా కాలంగా హీరోగా సినిమాలు చేస్తున్నా.. ఆశించిన రీతిలో ప్రభావాన్ని చూపలేకపోతోన్నాడు యూత్ స్టార్ నితిన్. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అతడు ఎన్నో చిత్రాలు చేసినా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. దీంతో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ చిత్రానికి టాక్ మంచిగా రాకపోవడంతో రెస్పాన్స్‌ను సరిగా అందుకోవడం లేదు. మరి ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ఐదు రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి!
ఫన్ మూవీతో వచ్చిన నితిన్:టాలీవుడ్ యూత్ హీరో నితిన్ నటించిన సినిమానే 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్'. వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డిలు నిర్మించారు. శ్రీలీల హీరోయిన్‌గా చేసిన ఈ మూవీలో రాజశేఖర్ సర్‌ప్రైజింగ్ రోల్ చేశారు. అలాగే, రావు రమేష్, సుదేవ్ నాయర్ తదితరులు నటించారు. హరీష్ జయరాజ్ దీనికి మ్యూజిక్‌ను ఇచ్చారు.

నితిన్ మూవీకి బిజినెస్ ఇలా:నితిన్ నటించిన 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్'కు నైజాంలో రూ. 7.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 9 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 19.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.70 కోట్లు, ఓవర్సీస్ హక్కులు రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 24.20 కోట్లు బిజినెస్ అయింది.
5వ రోజు తెలుగులో వసూళ్లు:నితిన్ - శ్రీలీల జంటగా నటించిన 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో పాటు నాని 'హాయ్ నాన్న' మూవీ నుంచి తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. దీంతో దీనికి వసూళ్లు పెద్దగా రావడం లేదు. ఇదే పరిస్థితిని ఐదో రోజు కూడా ఇది కంటిన్యూ చేసింది. ఫలితంగా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం రూ. 14 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

5 రోజులకూ కలిపి ఎంతంటే:కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాకు ఐదు రోజుల్లో చాలా తక్కువ స్పందనే వచ్చింది. ఫలితంగా ఇది నైజాంలో రూ. 1.49 కోట్లు, సీడెడ్‌లో రూ. 44 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలను కలిపి రూ. 1.49 కోట్లు వసూలు చేసింది. ఇలా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.42 కోట్లు షేర్, రూ. 6.50 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల్లో రూ. 3.42 కోట్లు రాబట్టిన 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఆశించిన రీతిలో స్పందనను అందుకోలేకపోయింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 41 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 46 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపితే 5 రోజుల్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.29 కోట్లు షేర్, రూ. 8.25 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:క్రేజీ స్టోరీతో రూపొందిన 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 4.29 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 20.71 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











