Extra Ordinary Man Collections: 6 రోజుల్లో అరాచకం.. చిన్న సినిమా కంటే.. డిజాస్టర్ దిశగా నితిన్ మూవీ
వరుసగా ఫ్లాపులు వస్తున్నా ఏమాత్రం నిరాశ చెందకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్. 'భీష్మ' తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం చూస్తోన్న అతడు.. ఎన్నో ప్రయోగాలు చేశాడు. కానీ, ఇవేమీ విజయాన్ని మాత్రం ఇవ్వలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో నితిన్ 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ చిత్రానికి టాక్ మంచిగా రాకపోవడంతో స్పందన ఆశించినట్లుగా రావట్లేదు. మరి ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ 6 రోజుల్లో ఎంత రాబట్టిందో చూడండి!
కమర్షియల్ స్టోరీతో నితిన్:టాలెంటెడ్ హీరో నితిన్ నటించిన తాజా సినిమానే 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్'. వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డిలు నిర్మించారు. శ్రీలీల హీరోయిన్‌గా చేసిన ఈ మూవీలో రాజశేఖర్ సర్‌ప్రైజింగ్ రోల్ చేశారు. అలాగే, రావు రమేష్, సుదేవ్ నాయర్ తదితరులు నటించారు. హరీష్ జయరాజ్ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు.

నితిన్ మూవీకి బిజినెస్ ఇలా:నితిన్ 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాకు నైజాంలో రూ. 7.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 9 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 19.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.70 కోట్లు, ఓవర్సీస్ హక్కులు రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 24.20 కోట్లు బిజినెస్ జరిగింది.
6వ రోజు తెలుగులో వసూళ్లు:నితిన్ - వక్కంతం వంశీ కాంబినేషన్‌లో రూపొందిన 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో ప్రేక్షఖుల ఆదరణ పెద్దగా లభించడం లేదు. దీంతో దీనికి వసూళ్లు మరీ తక్కువగానే వస్తున్నాయి. ఆరో రోజు ఈ చిత్రం మరింతగా డౌన్ అయింది. ఫలితంగా ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో బుధవారం రూ. 12 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

6 రోజులకూ కలిపి ఎంతంటే:ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాకు ఆరు రోజుల్లో చాలా తక్కువ స్పందనే వచ్చింది. ఫలితంగా ఇది నైజాంలో రూ. 1.54 కోట్లు, సీడెడ్‌లో రూ. 46 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలను కలిపి రూ. 1.54 కోట్లు వసూలు చేసింది. ఇలా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.54 కోట్లు షేర్, రూ. 6.70 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజుల్లో రూ. 3.54 కోట్లు రాబట్టిన 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఆశించిన రీతిలో స్పందనను అందుకోలేకపోయింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 43 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 48 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపితే 6 రోజుల్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.45 కోట్లు షేర్, రూ. 8.50 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:నితిన్ నటించిన 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 4.45 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 20.55 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











