Extra Ordinary Man Closing Collections: 50 కోట్ల సినిమాకు ఘోరంగా.. నితిన్ కెరీర్‌లో చెత్త రికార్డు
తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు మాత్రమే హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో యూత్ స్టార్ నితిన్ ఒకడు. ఈ మధ్య కాలంలో పెద్దగా విజయాలను అందుకోలేకపోతోన్న అతడు.. ఇటీవలే 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ చిత్రానికి కూడా ఆరంభంలోనే సరైన టాక్ రాలేదు. ఫలితంగా ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ కూడా ఆశించినట్లుగా దక్కలేదు. ఈ నేపథ్యంలో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ఫుల్ రన్‌లో ఎంత రాబట్టిందో మీరే చూడండి మరి!
ఫన్ ఎంటర్‌టైనర్‌తో నితిన్
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ నటించిన తాజా సినిమానే 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్'. వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డిలు నిర్మించారు. శ్రీలీల హీరోయిన్‌గా చేసిన ఈ మూవీలో రాజశేఖర్ సర్‌ప్రైజింగ్ రోల్ చేశారు. అలాగే, రావు రమేష్, సుదేవ్ నాయర్ తదితరులు నటించారు. హరీష్ జయరాజ్ మ్యూజిక్ ఇచ్చాడు.

నితిన్ మూవీకి బిజినెస్ ఇలా
నితిన్ 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీకి నైజాంలో రూ. 7.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 9 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 19.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.70 కోట్లు, ఓవర్సీస్ హక్కులు రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 24.20 కోట్లు బిజినెస్ అయింది.
అలాంటి టాక్‌తో నిరాశగానే
నితిన్ - వక్కంతం వంశీ కాంబినేషన్‌లో రూపొందిన 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో ప్రేక్షఖుల ఆదరణ పెద్దగా లభించడం లేదు. ఫలితంగా ఓపెనింగ్స్ ఆశించిన రీతిలో రాలేదు. ఆ తర్వాత కూడా స్పందన లేకపోవడంతో ఈ క్రేజీ మూవీకి వసూళ్లు మరీ తక్కువగానే వచ్చాయి. ఫలితంగా ఇది డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలనే మిగిల్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ రన్‌లో రూ. 3.95 కోట్లు రాబట్టిన 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఆశించిన రీతిలో స్పందనను అందుకోలేకపోయింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 55 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపితే మొత్తంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.00 కోట్లు షేర్, రూ. 9.50 కోట్లు గ్రాస్ రాబట్టింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
నితిన్ నటించిన 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో దీనికి రూ. 5 కోట్లు వచ్చాయి. ఫలితంగా ఈ చిత్రం రూ. 20 కోట్లు నష్టాలను చవి చూసి నితిన్ కెరీర్‌లోనే చెత్త రికార్డు నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











