Extra Ordinary Man Collections: నితిన్ మూవీకి మైండ్ బ్లాక్ కలెక్షన్లు.. మొదటి రోజే ఇలా వచ్చాయేంటి!
తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. ఈ మధ్య కాలంలో పెద్దగా హిట్లను ఖాతాలో వేసుకోలేకపోతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలన్న కసితో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే సినిమాతో వచ్చాడు. దీనికి మిక్స్‌డ్ టాక్ రావడంతో రెస్పాన్స్ ఆశించినట్లుగా రాలేదు. మరి ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మొదటి రోజు ఎంత రాబట్టిందో మీరే చూసేయండి!
ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్‌గానే:టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ నటించిన తాజా సినిమానే 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్'. వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డిలు నిర్మించారు. శ్రీలీల హీరోయిన్‌గా చేసిన ఈ మూవీలో రాజశేఖర్ సర్‌ప్రైజింగ్ రోల్ చేశారు. అలాగే, రావు రమేష్, సుదేవ్ నాయర్ తదితరులు నటించారు. హారిష్ జయరాజ్ మ్యూజిక్ ఇచ్చాడు.

నితిన్ మూవీకి బిజినెస్ ఇలా:'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాకు నైజాంలో రూ. 7.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 9 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 19.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.70 కోట్లు, ఓవర్సీస్ హక్కులు రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 24.20 కోట్లు బిజినెస్ జరిగింది.
అలాంటి టాక్‌తో మోస్తరుగా:ఆరంభంలోనే మంచి అంచనాలను ఏర్పరచుకుని 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా మోస్తరుగానే లభించింది. దీంతో దీనికి ఓపెనింగ్స్ కూడా ఏవరేజ్‌గానే వస్తాయని అంచనాలు వేశారు.

తొలి రోజు తెలుగులో వసూళ్లు:క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీకి మొదటి రోజు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో నిరాశనే ఎదుర్కొంది. దీంతో నైజాంలో రూ. 60 లక్షలు, సీడెడ్‌లో రూ. 21 లక్షలు, ఆంధ్రా మొత్తంలో కలిపి రూ. 70 లక్షలు రాబట్టింది. ఇలా మొదటి రోజు ఈ సినిమా రూ. 1.51 కోట్లు షేర్, రూ. 2.85 కోట్లు గ్రాస్ రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 1.51 కోట్లు రాబట్టిన 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఆశించిన రీతిలో స్పందనను అందుకోలేకపోయింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 25 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపితే తొలి రోజు ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.96 కోట్లు షేర్, రూ. 3.80 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా నమోదైంది. ఇక, మొదటి రోజు దీనికి రూ. 1.96 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 23.04 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











