Extra Ordinary Man: నితిన్ మూవీకి రికార్డు బిజినెస్.. హిట్ లేకున్నా అంతా.. అన్ని కోట్లు వస్తేనే హిట్
టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకుని ఎనలేని ఫాలోయింగ్, మార్కెట్‌ను సాధించుకున్న హీరో నితిన్. మధ్యలో వరుస పరాజయాలతో కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకున్న తరుణంలో 'ఇష్క్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. అయినా విజయాలను మాత్రం అందుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man) సినిమా చేశాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌పై ఓ లుక్కేద్దామా!
ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్‌గా:యూత్ స్టార్ నితిన్ నటించిన తాజా సినిమానే 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్'. వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డిలు నిర్మించారు. శ్రీలీల హీరోయిన్‌గా చేసిన ఈ మూవీలో రాజశేఖర్ సర్‌ప్రైజింగ్ రోల్ చేశారు. అలాగే, రావు రమేష్, సుదేవ్ నాయర్ తదితరులు నటించారు. హారిష్ జయరాజ్ సంగీతాన్ని అందించాడు.

అలాంటి కథతోనే వస్తుంది:జూనియర్ ఆర్టిస్టుగా పని చేసే ఓ కుర్రాడు.. తనలో గొప్ప నటుడు ఉన్నాడని తండ్రిని మెప్పించే ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ, ఆ ప్రయత్నాలు విఫలం అవుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో తనలోని ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ను బయటకు తీసుకు వచ్చే కథతో 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమా తెరకెక్కింది. ముఖ్యంగా ఇందులో రావు రమేష్, నితిన్ సీన్స్ అదిరిపోతాయని టాక్.
గ్రాండ్ రిలీజ్... సందడిగా:క్రేజీ కాంబోలో రూపొందిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీని డిసెంబర్ 8వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ సహా ఎన్నో ప్రాంతాల్లో ఈ చిత్రం హడావిడి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ సందడి నెలకొంది. అందుకు అనుగుణంగానే దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో లభిస్తోంది.

హక్కులకు భారీ డిమాండ్:ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ దక్కుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయని చెప్పాలి.
ఏపీ, తెలంగాణలో బిజినెస్:వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతోన్న నితిన్ నటించిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రికార్డు బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 7.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 9 కోట్లకు బిజినెస్ చేసింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 19.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:నితిన్ - శ్రీలీల జంటగా నటించిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీకి దేశ వ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ వచ్చింది. దీంతో ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.70 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 3 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.20 కోట్లు వ్యాపారం జరిగింది. అంటే రూ. 25 కోట్లు వస్తేనే ఈ సినిమా హిట్ అవుతుంది.
రెండో సినిమాగా రికార్డు:'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీకి వరల్డ్ వైడ్‌గా రూ. 24.20 కోట్లు బిజినెస్ అవడంతో నితిన్ కెరీర్‌లోనే రెండో అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన చిత్రంగా ఇది రికార్డు సాధించింది. దీనికంటే ముందు 'శ్రీనివాస కల్యాణం' 25.80 కోట్ల బిజినెస్‌తో టాప్‌లో ఉంది. ఈ రెండింటి తర్వాత 'రంగ్‌దే' రూ. 23.90 కోట్లు, 'భీష్మ' రూ. 21.80 కోట్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











