Robinhood Business: రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. నితిన్ సినిమా లాభాల్లోకి రావాలంటే?
20 ఏళ్ల క్రితం కెరీర్ స్టార్ట్ చేసిన నితిన్ నేటికీ స్టార్ రేసులో పోరాడుతూనే ఉన్నారు. ఒక్క హిట్ ఇస్తే నాలుగు ఫ్లాపులు అన్నట్లుగా ఆయన కెరీర్ కొనసాగుతోంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్లు ఇవ్వడంలో ఫెయిల్ కావడంతో నితిన్ కెరీర్ కుదుపులకు లోనవుతోంది. అప్పుడెప్పుడో వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మ తర్వాత నేటి వరకు ఆయనకు చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు నితిన్. మళ్లీ వెంకీ కుడుముల దర్శకత్వంలోనే రాబిన్ హుడ్ సినిమాను చేస్తున్నారు.
వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న శ్రీలీల ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్‌గా నటించారు. వెన్నెల కిషోర్, రాజేంద్రపస్రాద్, దేవదత్త నాగె, టామ్ చాకో, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశకంర్‌లు దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 28న రాబిన్ హుడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ పోషిస్తుండటంతో క్రికెట్ వర్గాలు సైతం రాబిన్ హుడ్‌పై ఆసక్తితో ఉన్నాయి. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు సారథ్యం వహించినప్పటి నుంచి తెలుగు సినిమాలు, తెలుగువారిపై ఎంతో అభిమానం పెంచుకున్న వార్నర్ .. తెలుగు పాటలకు రీల్స్, టిక్ టాక్ వీడియోలు చేసి బాగా ఫేమస్ అయ్యారు. ఆయనను తెలుగు అభిమానులు వార్నర్ మామ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే వార్నర్ తన కెరీర్‌లోనే తొలిసారిగా ఓ సినిమా చేస్తుండంటం అది కూడా తెలుగు సినిమా కావడంతో రాబిన్‌హుడ్‌పై భారీ అంచనాలున్నాయి.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన డేవిడ్ వార్నర్ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అలాగే తన స్పీచ్‌తోనూ ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కేతిక శర్మ వేసిన ఐటెం సాంగ్ కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. అది దా సర్‌ప్రైజ్ అంటూ ఆమె వేసిన స్టెప్స్, వాటిని కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్‌ను నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. అయినప్పటికీ ఈ పాట మాత్రం మాస్‌ను ఊపేస్తోంది. ఇలా ఇన్ని ప్రత్యేకతలున్న రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ బిజినెస్‌పైనా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
ఫిలింనగర్ టాక్ ప్రకారం రాబిన్ హుడ్ సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరగ్గా.. డిజిటల్ రైట్స్‌ను కళ్లు చెదిరే ధరకు జీ 5 సొంతం చేసుకుందట. మొత్తంగా ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.35 కోట్ల షేర్ , రూ. 70 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. నితిన్ గత సినిమాల రికార్డులు , థియేట్రికల్ బిజినెస్ లెక్కల్ని చూస్తే ఈ హీరో ముందు ఇది పెద్ద టాస్కేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే డేవిడ్ వార్నర్, శ్రీలీల, కేతిక శర్మలతో కలిసి మేజిక్ చేస్తానని నితిన్ ధీమాగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











