Check Movie 10 days collections: నితిన్‌కు షాకిచ్చిన ఆడియెన్స్.. భయపెడుతోన్న భారీ టార్గెట్!
'జయం' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు టాలెంటెడ్ స్టార్ నితిన్. ఆ వెంటనే పలు విజయాలను అందుకున్న అతడు.. మినిమం గ్యారెంటీ హీరోగా ఎదిగిపోయాడు. తద్వారా మార్కెట్‌ను కూడా బాగానే పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే వరుస పరాజయాల కారణంగా కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకున్నాడు. ఇక, 'ఇష్క్' నుంచి హిట్ ట్రాక్ ఎక్కిన అతడు.. భారీ విజయాలను అందుకుని సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల 'చెక్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం నిరాశగా సాగుతోంది. ఇది పది రోజుల్లో ఎంత రాబట్టిందంటే!

కొత్తగా ప్రయత్నించిన నితిన్.. ఆయనతో కలిసి
కెరీర్ ఆరంభం నుంచే కమర్శియల్ సినిమాలు చేసిన నితిన్.. తొలిసారి ఓ ప్రయోగాత్మక చిత్రంతో వచ్చాడు. అదే.. 'చెక్'. విలక్షణ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తీసిన ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. కీరవాణి సంగీతం అందించారు. ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుక వచ్చిందీ సినిమా.

ఆ హిట్ ప్రభావం.. భారీగా జరిగిన ప్రీ బిజినెస్
'భీష్మ'తో గత ఏడాది భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు నితిన్. దీనికి బాగానే కలెక్షన్లు వచ్చాయి. అలాగే, 'చెక్' మూవీ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఫలితంగా బయ్యర్లు కూడా ఈ సినిమాను కొనేందుకు ఆసక్తిని చూపించారు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 16.10 కోట్లు వరకూ జరిగింది.

ఆరంభంలోనే అలాంటి టాక్.. వాటి పోటీ వల్ల
'చెక్' సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి మిక్స్‌డ్ టాక్‌తోనే నడుస్తోంది. దీంతో అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. దీనికి తోడు వైష్ణవ్ తేజ్ నటించిన 'ఉప్పెన', అల్లరి నరేష్ 'నాంది' హవా కారణంగా ఈ సినిమా కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతూ వస్తోంది.

పదో రోజు నితిన్‌కు భారీ షాకిచ్చిన ఆడియెన్స్
సాధారణంగా ఆదివారం అంటే ఎన్ని సినిమాలు ఉన్నా కలెక్షన్లు ఓ రేంజ్‌లో వస్తుంటాయి. అలాంటిది నితిన్ నటించిన 'చెక్'కు మాత్రం ఆరోజు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. అదే సమయంలో మిగిలిన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. ఇక, పదో రోజైన ఆదివారం ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 లక్షలు మాత్రమే వసూలు చేయడం గమనార్హం.

పది రోజులకు కలిపి ఎంత రాబట్టిందో తెలుసా?
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'చెక్' మూవీ కలెక్షన్లు నిరాశజనకంగానే ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం వరుసగా రూ. 3.38 కోట్లు, రూ. 1.60 కోట్లు, రూ. 1.90 కోట్లు, రూ. 53 లక్షలు, రూ. 32 లక్షలు, రూ. 19 లక్షలు, రూ. 10 లక్షలు, రూ. 7 లక్షలు, రూ. 5 లక్షలు, రూ. 7 లక్షలతో మొత్తంగా పది రోజుల్లో రూ. 8.21 కోట్లు షేర్, రూ. 14.40 కోట్లు గ్రాస్ రాబట్టింది.

భయపెడుతోన్న భారీ టార్గెట్.. ఇంకెంత రావాలి?
'చెక్' మూవీ మొత్తం బిజినెస్ రూ. 16.10 కోట్లు వరకూ జరిగింది. పది రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 8.21 కోట్లు, కర్నాటకతో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 35 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 71 లక్షలతో కలిపి రూ. 9.27 కోట్లు వచ్చాయి. అలాగే, రూ. 17 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ (రూ. 16.50 కోట్లు) చేరుకోవాలంటే మరో రూ. 7.23 కోట్లు రాబట్టాలి.


Click it and Unblock the Notifications











