Check Movie 3days collections: మూడో రోజు పుంజుకున్న ‘చెక్’.. హిట్ అవ్వాలంటే ఎంత రావాలో తెలుసా?

'జయం' అనే సినిమాతో హీరోగా పరిచయమై.. కెరీర్ ఆరంభంలోనే పలు హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు టాలెంటెడ్ స్టార్ నితిన్. అలాంటి అతడికి కొన్నేళ్ల పాటు వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'ఇష్క్' అనే మూవీతో మరోసారి విజయాన్ని అందుకున్నాడు. అప్పటి నుంచి ఎన్నో హిట్లను సాధిస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం నితిన్ 'చెక్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ మూడు రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఇంకెంత రాబడితే హిట్ అవుతుంది?

టాలెంటెడ్ డైరెక్టర్‌తో జోడీ కట్టిన నితిన్

టాలెంటెడ్ డైరెక్టర్‌తో జోడీ కట్టిన నితిన్

గత ఏడాది 'భీష్మ' వంటి భారీ హిట్ అందుకున్న నితిన్.. ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో 'చెక్' అనే మూవీ చేశాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. కీరవాణి సంగీతం అందించారు. కమర్షియల్ పంథాకు దూరంగా తొలిసారి కాన్సెప్ట్ మూవీలో చేశాడు నితిన్.

అతడికి తగ్గట్లే భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్

అతడికి తగ్గట్లే భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్

ఆరంభంలో 'చెక్' మూవీని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాతి నుంచి దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. అప్పటి నుంచి ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కారణంగానే 'చెక్' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.10 కోట్లు వరకూ జరిగింది. దీంతో ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది.

టాక్‌ మాత్రం అలా... ఆ సినిమా ఎఫెక్ట్

టాక్‌ మాత్రం అలా... ఆ సినిమా ఎఫెక్ట్

నితిన్ నటించిన 'చెక్' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1500లకు పైగా థియేటర్లలో విడుదల అయింది. మొదటి ఆట మొత్తంగా దీనికి మిక్స్‌డ్ టాక్ వచ్చిందనే చెప్పాలి. అదే సమయంలో వైష్ణవ్ తేజ్ నటించిన 'ఉప్పెన', అల్లరి నరేష్ 'నాంది' హవా కారణంగా ఈ సినిమా కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతోంది.

మూడో రోజు ఎక్కడ? ఎంత? వచ్చింది

మూడో రోజు ఎక్కడ? ఎంత? వచ్చింది

మూడో రోజైన ఆదివారం 'చెక్'కు మంచి కలెక్షన్లే వచ్చాయి. నైజాంలో రూ. 71 లక్షలు, సీడెడ్‌లో రూ. 18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 29 లక్షలు, ఈస్ట్‌లో రూ. 10 లక్షలు, వెస్ట్‌లో రూ. 30 లక్షలు, గుంటూరులో రూ. 13 లక్షలు, కృష్ణాలో రూ. 11.80 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలు రాబట్టింది. మొత్తంగా మూడో రోజు ఈ చిత్రం రూ. 1.90 కోట్లు షేర్, రూ. 3.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

మూడు రోజులకు కలిపి ఎంత వచ్చింది?

మూడు రోజులకు కలిపి ఎంత వచ్చింది?

'చెక్' సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో సూపర్ డూపర్ హిట్ అయిన 'ఉప్పెన', 'నాంది' వైపే ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. తద్వారా ఈ సినిమా వసూళ్లు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. ఇక, మూడు రోజుల్లో నితిన్ నటించిన ఈ సినిమా వరుసగా రూ. 3.38 కోట్లు, రూ. 1.60 కోట్లు, రూ. 1.90 కోట్లతో మొత్తంగా రూ. 6.88 కోట్లు షేర్, రూ. 12.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

హిట్ అవ్వాలంటే ఎంత రావాలో తెలుసా?

హిట్ అవ్వాలంటే ఎంత రావాలో తెలుసా?

ఈ సినిమా మొత్తం బిజినెస్ రూ. 16.10 కోట్లు వరకూ జరిగింది. మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 6.88 కోట్లు, కర్నాటకతో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 18 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 60 లక్షలతో రూ. 7.66 కోట్లు వచ్చాయి. అలాగే, రూ. 14 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ (రూ. 16.50 కోట్లు) చేరుకోవాలంటే మరో రూ. 8.84 కోట్లు రాబట్టాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X