twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Check Movie 4days collections: ఒక్కసారిగా పడిపోయిన ‘చెక్’ కలెక్షన్స్.. ఇంకా అంత వస్తేనే హిట్టైనట్లు

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్లలో యంగ్ హీరో నితిన్ ఒకడు. 'జయం' అనే సినిమాతో హీరోగా ప్రస్థానాన్ని ప్రారంభించిన అతడు.. ఆ వెంటనే పలు విజయాలను తన ఖాతాలో వేసుకుని సత్తా చాటాడు. ఈ క్రమంలోనే పలు పరాజయాలను కూడా చవి చూశాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఇష్క్' అనే సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నితిన్ 'చెక్' అనే సినిమా చేశాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లో ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!

    పంథా మార్చిన నితిన్.. తొలిసారి ఆ పాత్రలో

    పంథా మార్చిన నితిన్.. తొలిసారి ఆ పాత్రలో

    చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ నటించిన చిత్రమే 'చెక్'. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. కీరవాణి సంగీతం అందించారు. ఆరంభం నుంచి కమర్షియల్ సినిమాలు చేస్తూ వస్తున్న నితిన్.. ఇందులో కెరీర్‌లో మొదటిసారి యాక్టింగ్‌కు స్కోప్ ఎక్కువగా ఉన్న పాత్రలో నటించాడు.

    ఆ మూవీ ఎఫెక్ట్.. భారీగా జరిగిన ప్రీ బిజినెస్

    ఆ మూవీ ఎఫెక్ట్.. భారీగా జరిగిన ప్రీ బిజినెస్

    గత ఏడాది 'భీష్మ'తో భారీ హిట్‌ను అందుకున్నాడు నితిన్. దీనికితోడు 'చెక్' మూవీ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఇలాంటి పరిస్థితుల్లో బయ్యర్లు కూడా దీన్ని కొనేందుకు ఆసక్తిని చూపించారు. ఫలితంగా ఈ ప్రతిష్టాత్మక సినిమాకుప్రపంచ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 16.10 కోట్లు వరకూ జరిగింది.

    ఆరంభంలోనే అలాంటి టాక్.. వాటి పోటీ వల్ల

    ఆరంభంలోనే అలాంటి టాక్.. వాటి పోటీ వల్ల

    'చెక్' సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి మిక్స్‌డ్ టాక్‌తోనే నడుస్తోంది. దీంతో అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. దీనికి తోడు వైష్ణవ్ తేజ్ నటించిన 'ఉప్పెన', అల్లరి నరేష్ 'నాంది' హవా కారణంగా ఈ సినిమా కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతూ వస్తోంది.

    నాల్గో రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది

    నాల్గో రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది

    నాలుగో రోజై 'చెక్' కలెక్షన్లు సగానికి సగం పడిపోయాయి. తద్వారా నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్‌లో రూ. 6 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 3.90 లక్షలు, కృష్ణాలో రూ. 4.10 లక్షలు, నెల్లూరులో రూ. 2.60 లక్షలు రాబట్టింది. మొత్తంగా నాల్గొ రోజు రూ. 53 లక్షలు షేర్, రూ. 91 లక్షలు గ్రాస్ వచ్చింది.

    నాలుగు రోజులకు కలిపి ఎంత రాబట్టిందంటే

    నాలుగు రోజులకు కలిపి ఎంత రాబట్టిందంటే

    ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'చెక్' మూవీ కలెక్షన్లు నిరాశజనకంగానే ఉన్నాయి. ఎప్పుడో విడుదలైన చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంటో.. నితిన్ చిత్రం మాత్రం మోస్తరు వసూళ్లను రాబడుతోంది. దీంతో నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం వరుసగా రూ. 3.38 కోట్లు, రూ. 1.60 కోట్లు, రూ. 1.90 కోట్లు, 53 లక్షలతో రూ. 7.41 కోట్లు షేర్, రూ. 13 కోట్లు గ్రాస్ రాబట్టింది.

    హిట్ అవ్వాలంటే ఇంకా ఎంత రావాలో తెలుసా?

    హిట్ అవ్వాలంటే ఇంకా ఎంత రావాలో తెలుసా?

    'చెక్' మూవీ మొత్తం బిజినెస్ రూ. 16.10 కోట్లు వరకూ జరిగింది. నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 7.41 కోట్లు, కర్నాటకతో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 25 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 63 లక్షలతో రూ. 8.29 కోట్లు వచ్చాయి. అలాగే, రూ. 15.20 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ (రూ. 16.50 కోట్లు) చేరుకోవాలంటే మరో రూ. 8.21 కోట్లు రాబట్టాలి.

    English summary
    Nithin Reddy, known professionally as Nithiin, is an Indian film actor and producer known for his works predominantly in Telugu cinema. Nithiin made his film debut in the year 2002 with Jayam, for which he received the Filmfare Award for Best Male Debut.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X