Check మూవీ బిజినెస్: భారీగా జరిగిన నితిన్ మూవీ బిజినెస్: బ్రేక్ ఈవెన్ టార్గెట్ గట్టిగానే పెట్టుకున్నాడుగా
కొద్ది రోజులుగా సరైన హిట్ లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి కచ్చితంగా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగాంగానే టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తోన్న చిత్రం 'చెక్'. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. కీరవాణి సంగీతం సమకూర్చారు.
ప్రియురాలితో కలిసి ఎంజాయ్ చేస్తూ తిరిగే ఓ కుర్రాడికి ఊహించని పరిస్థితుల్లో దేశ ద్రోహం కేసులో చిక్కుకుంటాడు. ఆ తర్వాత అతడికి ఉరి శిక్ష పడుతుంది. జైలులో ఖైదీగా ఉన్న సమయంలో చెస్ ప్లేయర్‌గా మారి దేశానికి ఎలా విజయాన్ని అందించాడు అన్న కథతో ఈ మూవీ రూపొందింది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ లాయర్‌గా, ప్రియా ప్రకాశ్ వారియర్.. నితిన్ ప్రియురాలిగా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. దీంతో ఈ మూవీపై అందరి దృష్టీ పడింది. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది.

'చెక్' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను పరిశీలిస్తే.. నైజా హక్కులు రూ. 5.40 కోట్లకు, సీడెడ్ రైట్స్ రూ. 2.80 కోట్లకు, ఆంధ్ర (ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు) హక్కులు రూ. 6.80 కోట్లకు అమ్ముడు పోయాయి. అంటే తెలుగు రాష్ట్రాల హక్కులు రూ. 15 కోట్లు పలికాయి. ఇక, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ రూ. 1.10 కోట్లకు సేల్ అయ్యాయి. అంటే మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 16.10 కోట్లు వ్యాపారం జరుపుకుంది. తద్వారా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.50 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications











