Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్‌పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
Rang De Total Collections: నితిన్‌కు రెండో షాక్.. 24.50 కోట్ల టార్గెట్.. చివరకు వచ్చింది ఎంతంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అప్పుడెప్పుడో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యూత్ స్టార్ నితిన్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకుని స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. దీంతో అతడు బడా హీరో అయిపోతాడని అంతా అనుకున్నారు. కానీ, వరుస పరాజయాలతో కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకున్నాడు. ఈ మధ్య మళ్లీ సక్సెస్ బాట పట్టిన అతడు.. 'రంగ్ దే' అంటూ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరిస్థితులు బాలేకపోవడంతో ఇది టార్గెట్‌ను పూర్తి చేయకుండానే ఆగిపోవాల్సి వచ్చింది. ఇక, ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్ల రిపోర్టును పరిశీలిస్తే...
ఆమెతో కలిసి ‘రంగ్ దే' అంటూ వచ్చిన నితిన్
'చెక్' వంటి భారీ పరాజయం తర్వాత యూత్ స్టార్ నితిన్ నటించిన చిత్రమే 'రంగ్ దే'. ఫుల్ లెంగ్త్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు. దీనికి మంచి టాక్ వచ్చింది.
వాటితో పెరిగిన అంచనాలు... బిజినెస్ భారీగా
పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ల కారణంగా 'రంగ్ దే'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే నైజాంలో ఈ చిత్రం రూ. 7.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.6 కోట్లు, ఆంధ్రాలో రూ. 10 కోట్లతో రెండు రాష్ట్రాల్లో రూ. 21.20 కోట్ల వ్యాపారం జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్లో రూ. 1.50 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 23.90 కోట్ల మేర బిజినెస్ నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ, ఎంత రాబట్టిందంటే?
తెలుగు రాష్ట్రాల్లో 'రంగ్ దే' మంచి టాక్‌ను తెచ్చుకున్నా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 5.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.15 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.78 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.08 కోట్లు, వెస్ట్‌లో రూ. 65 లక్షలు, గుంటూరులో రూ. 1.18 కోట్లు, కృష్ణాలో రూ. 74 లక్షలు, నెల్లూరులో రూ. 52 లక్షలతో ముగింపు సమయానికి రూ. 13.90 కోట్లు షేర్, రూ. 22.63 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా దీనికి వచ్చిన కలెక్షన్లెంత?
ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ
రాష్ట్రాల
మాదిరి
గానే
మిగిలిన
ప్రాంతాల్లోనూ
ప్రతికూల
ఫలితాలనే
ఎదుర్కొంది
'రంగ్
దే'
మూవీ.
ఫలితంగా
ముగింపు
సమయానికి
కర్నాటక
ప్లస్
రెస్టాఫ్
ఇండియాలో
రూ.
78
లక్షలు,
ఓవర్సీస్లో
రూ.
1.83
కోట్లు
కలెక్ట్
చేసింది.
దీంతో
ప్రపంచ
వ్యాప్తంగా
ఈ
చిత్రానికి
రూ.
16.51
కోట్లు
షేర్,
రూ.
28.80
కోట్లు
గ్రాస్
వచ్చింది.
దీంతో
చాలా
ప్రాంతాల్లో
నిరాశే
ఎదుర్కొంది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఫైనల్ రిపోర్టు ఇదే
నితిన్ - కీర్తీ సురేష్ జంటగా నటించిన 'రంగ్ దే' సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ రూ. 23.90 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 24.50 కోట్లుగా నమోదైంది. అయితే, ఈ సినిమా క్లోజింగ్ సమయానికి కేవలం రూ. 16.51 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఫలితంగా రూ. 7.99 కోట్లు నష్టాలను ఎదుర్కొంది. అంటే ఈ సినిమా ఫ్లాప్ స్టేటస్‌తోనే ముగిసిపోయింది.
Recommended Video
నితిన్‌కు వరుసగా రెండో షాక్.. ఇప్పుడు అదే
ఈ ఏడాది ఆరంభంలోనే నితిన్ 'చెక్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇప్పుడు వెంకీ అట్లూరి తీసిన 'రంగ్ దే' కూడా అదే ఫలితాన్ని అందుకుంది. ఫలితంగా నితిన్‌కు వరుసగా రెండు షాక్‌లు తగిలినట్లైంది. ఇక, ఇప్పుడు అతడు 'మ్యాస్ట్రో' అనే సినిమా చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దీన్ని తెరకెక్కిస్తున్నాడు.