Rang De 10 Days Collections: ఆదివారం లక్ష మాత్రమే.. 24.5 కోట్లు బిజినెస్.. ఇంకా అంత వస్తేనే హిట్

అద్భుతమైన యాక్టింగ్‌తో పాటు సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపుతూ అటు మాస్ ఆడియెన్స్‌ను ఇటు క్లాస్ ఆడియెన్స్‌నూ ఆకట్టుకుంటున్నాడు యూత్ స్టార్ నితిన్. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. గ్రాఫుతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఫలితంగా ఓ హిట్.. ఓ ఫ్లాప్ అన్నట్లుగా కెరీర్‌ను సాగిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఓ డిజాస్టర్‌ను అందుకున్న నితిన్.. ఇటీవలే 'రంగ్ దే' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా టాక్ బాగున్నా కలెక్షన్లు మాత్రం ఆశించిన రీతిలో రావట్లేదు. ఇక, ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్టు చూస్తే...

వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్: పవన్ కళ్యాణ్ నా దేవుడంటూ బండ్ల గణేష్ రచ్చ (ఫొటోలు)

‘రంగ్ దే' అంటూ ఫ్యామిలీ మూవీతో వచ్చారు

‘రంగ్ దే' అంటూ ఫ్యామిలీ మూవీతో వచ్చారు

'చెక్' వంటి భారీ పరాజయం తర్వాత యూత్ స్టార్ నితిన్ నటించిన చిత్రమే 'రంగ్ దే'. ఫుల్ లెంగ్త్ లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు. దీనికి మంచి టాక్ వచ్చింది.

వైల్డ్ డాగ్ సినిమా చూసి రోమాలు నిక్కబొడుచుకొన్నాయి.. నాగ్‌పై చిరంజీవి ప్రశంసలు (ఫొటోలు)

వాటితో పెరిగిన అంచనాలు.. బిజినెస్ భారీగా

వాటితో పెరిగిన అంచనాలు.. బిజినెస్ భారీగా

పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్‌ల కారణంగా 'రంగ్ దే'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే నైజాంలో ఈ చిత్రం రూ. 7.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.6 కోట్లు, ఆంధ్రాలో రూ. 10 కోట్లతో రెండు రాష్ట్రాల్లో రూ. 21.20 కోట్ల వ్యాపారం జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 23.90 కోట్ల మేర బిజినెస్ నమోదైంది.

ఎర్ర చీర మూవీ సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

10వ రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత వచ్చిందంటే?

10వ రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత వచ్చిందంటే?

'రంగ్ దే' మూవీకి పదో రోజు ఒక లక్ష ప్లస్ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1.10 లక్షలు, వెస్ట్‌లో రూ. 80 వేలు, గుంటూరులో రూ. 1.30 లక్షలు, కృష్ణాలో రూ. 1.40 లక్షలు, నెల్లూరులో రూ. 60 వేలతో తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం రూ. 18 లక్షలు షేర్, రూ. 33 లక్షలు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

వైల్డ్ డాగ్ సక్సెస్ మీట్ (ఫొటోలు)

పది రోజులకు కలిపి ఎంత మేర రాబట్టిందంటే?

పది రోజులకు కలిపి ఎంత మేర రాబట్టిందంటే?

'రంగ్ దే' 1వ రోజు రూ. 4.62 కోట్లు, 2వ రోజు రూ. 2.54 కోట్లు, 3వ రోజు రూ. 2.88 కోట్లు, 4వ రోజు రూ. 1.51, 5వ రోజు రూ. 73 లక్షలు, 6వ రోజు రూ. 44 లక్షలు 7వ రోజు రూ. 38 లక్షలు, 8వ రోజు రూ. 29 లక్షలు, 9వ రోజు రూ. 17 లక్షలు 10వ రోజు రూ. 18 లక్షలతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా రూ. 13.74 కోట్లు షేర్‌, రూ. 22.33 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల ఎంతంటే?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే 'రంగ్ దే'.. మిగిలిన ప్రాంతాల్లోనూ ఒకే రకమైన స్పందనను అందుకుంది. ఆంధ్రా ప్లస్ తెలంగాణలో పది రోజులకు రూ. 13.56 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 76 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.80 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా 10 రోజులకు రూ. 16.30 కోట్లు షేర్, రూ. 28.38 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

ప్రపంచ వ్యాప్తంగా 'రంగ్ దే' బిజినెస్ రూ. 23.90 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 24.50 కోట్లుగా నమోదైంది. ఇక, పది రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.30 కోట్లు వసూలు అయ్యాయి. దీంతో ఈ చిత్రం హిట్‌గా నిలవాలంటే మరో రూ. 8.20 కోట్లు కలెక్ట్ చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో సోమవారం నుంచి ఈ చిత్రానికి అసలు సిసలైన పరీక్ష ఎదురు కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X