Rang De 4 Days Collections: సగానికి సగం పడిపోయిన కలెక్షన్లు.. వీకెండ్ తర్వాత నితిన్ పరిస్థితి ఇలా!

కొంత కాలంగా ఒక హిట్టు.. ఒక ఫ్లాపు అన్నట్లుగా తన కెరీర్‌ను సమాంతరంగా నడుపుకుంటూ ముందుకెళ్తున్నాడు యూత్ స్టార్ నితిన్. జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న అతడు.. గత ఏడాది లాక్‌డౌన్‌కు ముందు 'భీష్మ' వంటి భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఈ సంవత్సరం మాత్రం 'చెక్'తో భారీ పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'రంగ్ దే' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం నాలుగు రోజుల బాక్సాఫీస్ రిపోర్టును ఒకసారి పరిశీలిద్దాం పదండి!

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ హంగామా మధ్య వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్.. పవర్ స్టార్ అంటూ జై కొట్టిన దిల్ రాజు, వేణు శ్రీరాం

అన్ని ఎమోషన్స్‌తో వచ్చిన ‘రంగ్ దే' మూవీ

అన్ని ఎమోషన్స్‌తో వచ్చిన ‘రంగ్ దే' మూవీ

'చెక్' వంటి డిజాస్టర్ మూవీ తర్వాత యూత్ స్టార్ నితిన్ నటించిన చిత్రమే 'రంగ్ దే'. ప్రేమ కథా చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి మంచి టాక్ సొంతం అయింది.

వాటితో పెరిగిన అంచనాలు.. బిజినెస్ భారీగా

వాటితో పెరిగిన అంచనాలు.. బిజినెస్ భారీగా

పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్‌ల కారణంగా 'రంగ్ దే'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే నైజాంలో ఈ చిత్రం రూ. 7.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.6 కోట్లు, ఆంధ్రాలో రూ. 10 కోట్లతో రెండు రాష్ట్రాల్లో రూ. 21.20 కోట్ల వ్యాపారం జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 23.90 కోట్ల మేర బిజినెస్ నమోదైంది.

నాలుగో రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది?

నాలుగో రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది?

'రంగ్ దే' మూవీ నాలుగో రోజు కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 74 లక్షలు, సీడెడ్‌లో రూ. 31 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 19 లక్షలు, ఈస్ట్‌లో రూ. 7 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6.20 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో సోమవారం రూ. 1.51 కోట్లు షేర్, రూ. 2.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

నాలుగు రోజులకు కలిపి ఎంత రాబట్టిందంటే?

నాలుగు రోజులకు కలిపి ఎంత రాబట్టిందంటే?

'రంగ్ దే' మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 800 థియేటర్లలో విడుదల అయింది. అన్ని ప్రాంతాల్లోనూ మంచి స్పందననే అందుకుంది. అందుకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లను రాబట్టింది. మొదటి రోజు రూ. 4.62 కోట్లు, రెండో రోజు రూ. 2.54 కోట్లు.. మూడో రోజు రూ. 2.88 కోట్లు, నాలుగో రోజు రూ. 1.51 కోట్లతో మొత్తంగా రూ. 11.55 కోట్లు షేర్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల ఎంతంటే?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటిన 'రంగ్ దే'.. మిగిలిన ప్రాంతాల్లోనూ మంచి స్పందననే అందుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణలో నాలుగు రోజులకు రూ. 11.55 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 68 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.62 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా 4 రోజులకు రూ. 13.85 కోట్లు షేర్, రూ. 24.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

ప్రపంచ వ్యాప్తంగా 'రంగ్ దే' బిజినెస్ రూ. 23.90 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 24.50 కోట్లుగా నమోదైంది. ఇక, నాలుగు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.85 కోట్లు వసూలు అయ్యాయి. దీంతో ఈ చిత్రం క్లీన్ హిట్‌గా నిలవాలంటే మరో రూ. 10.65 కోట్లు కలెక్ట్ చేయాలి. వచ్చే శుక్రవారం వరకూ పెద్ద సినిమాలు లేకపోవడంతో దీనికి మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X