Rang De 5 Days Collections: నితిన్‌కు భారీ ఎదురుదెబ్బ.. దారుణంగా ‘రంగ్ దే’ వసూళ్లు.. అంత వస్తేనే!

టాలీవుడ్‌లో జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకడు. చాలా కాలం పాటు వరుస పరాజయాలతో సతమతం అయినప్పటికీ.. సినిమాలు చేస్తూనే వచ్చాడతను. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను సైతం అందుకున్నాడు. ఇక, గత ఏడాది లాక్‌డౌన్‌కు ముందే 'భీష్మ'తో భారీ విజయాన్ని దక్కించుకున్న ఈ యంగ్ హీరో.. ఈ సంవత్సరం మాత్రం 'చెక్' వంటి డిజాస్టర్‌ను ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా 'రంగ్ దే' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ ఐదు రోజుల రిపోర్టు మీకోసం!

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ హంగామా మధ్య వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్.. పవర్ స్టార్ అంటూ జై కొట్టిన దిల్ రాజు, వేణు శ్రీరాం

ఆమెతో కలిసి ‘రంగ్ దే' అంటూ వచ్చిన నితిన్

ఆమెతో కలిసి ‘రంగ్ దే' అంటూ వచ్చిన నితిన్

'చెక్' వంటి డిజాస్టర్ మూవీ తర్వాత యూత్ స్టార్ నితిన్ నటించిన చిత్రమే 'రంగ్ దే'. ప్రేమ కథా చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి మంచి టాక్ సొంతం అయింది.

కీర్తీ సురేష్ బ్యూటీఫుల్ గ్యాలరీ.. రంగ దే‌తో మరో సక్సెస్ అందుకొన్న మహానటి

వాటితో పెరిగిన అంచనాలు.. బిజినెస్ భారీగా2

వాటితో పెరిగిన అంచనాలు.. బిజినెస్ భారీగా2

పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్‌ల కారణంగా 'రంగ్ దే'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే నైజాంలో ఈ చిత్రం రూ. 7.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.6 కోట్లు, ఆంధ్రాలో రూ. 10 కోట్లతో రెండు రాష్ట్రాల్లో రూ. 21.20 కోట్ల వ్యాపారం జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 23.90 కోట్ల మేర బిజినెస్ నమోదైంది.

నాభి‌ ప్రదర్శనతో శ్రద్దా దాస్ అందాల ఆరబోత.. క్రేజీ ఫోటోషూట్ వైరల్...

ఐదో రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత వచ్చిందంటే?

ఐదో రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత వచ్చిందంటే?

'రంగ్ దే' మూవీ ఐదో రోజు కలెక్షన్లు మరింతగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 37 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్‌లో రూ. 5 లక్షలు, వెస్ట్‌లో రూ. 1.80 లక్షలు, గుంటూరులో రూ. 2.80 లక్షలు, కృష్ణాలో రూ. 2.90 లక్షలు, నెల్లూరులో రూ. 1.10 లక్షలతో తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం రూ. 73 లక్షలు షేర్, రూ. 1.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

దిశాపటానీ బోల్డ్ ఫోటోలు.. ముంబై ఎయిర్‌పోర్టులో స్మార్ట్‌గా

ఐదు రోజులకు కలిపి ఎంత మేర రాబట్టింది?

ఐదు రోజులకు కలిపి ఎంత మేర రాబట్టింది?

'రంగ్ దే' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ మంచి స్పందననే అందుకుంది. అందుకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లను రాబట్టింది. మొదటి రోజు రూ. 4.62 కోట్లు, రెండో రోజు రూ. 2.54 కోట్లు.. మూడో రోజు రూ. 2.88 కోట్లు, నాలుగో రోజు రూ. 1.51, ఐదో రోజు రూ. 73 లక్షలతో మొత్తంగా రూ. 12.28 కోట్లు షేర్‌, రూ. 19.46 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

లంగా ఓణిలో పాయల్ రాధాకృష్ణ.. యువ తార లవ్లీ ఫోటోషూట్...

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల ఎంతంటే?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటిన 'రంగ్ దే'.. మిగిలిన ప్రాంతాల్లోనూ మంచి స్పందననే అందుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణలో ఐదు రోజులకు రూ. 12.28 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.65 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా 5 రోజులకు రూ. 14.63 కోట్లు షేర్, రూ. 25.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

ప్రపంచ వ్యాప్తంగా 'రంగ్ దే' బిజినెస్ రూ. 23.90 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 24.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఐదు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.63 కోట్లు వసూలు అయ్యాయి. దీంతో ఈ చిత్రం క్లీన్ హిట్‌గా నిలవాలంటే మరో రూ. 9.87 కోట్లు కలెక్ట్ చేయాలి. క్రమంగా కలెక్షన్లు పడిపోతుండడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎప్పటికి రీచ్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X