Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్‌ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Rang De 6 Days Collections: నితిన్‌కు మరో భారీ షాక్.. టాక్ అలా.. కలెక్షన్లు ఊహించని విధంగా!
'జయం' అనే సినిమాతో టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు యూత్ స్టార్ నితిన్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. ఆ తర్వాత చాలా కాలం పాటు సరైన విజయాన్ని అందుకోలేకపోయాడు. ఇక, 'ఇష్క్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన ఈ టాలెంటెడ్ హీరో.. అప్పటి నుంచి జయాపజయాలతో ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల 'రంగ్ దే' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి టాక్ మంచిగే వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం షాకింగ్‌గా ఉన్నాయి. ఈ మూవీ 6 రోజుల బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!
సంజీదా షేక్ కూల్ గ్లామరస్ లుక్స్
‘చెక్' తర్వాత ‘రంగ్ దే' అంటూ వచ్చిన నితిన్
ఈ ఏడాది ప్రారంభంలోనే 'చెక్' వంటి డిజాస్టర్‌ను చవి చూశాడు నితిన్. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 'రంగ్ దే' అంటూ వచ్చాడు. ప్రేమ కథా చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు.
వాటితో పెరిగిన అంచనాలు.. బిజినెస్ భారీగా
పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ల కారణంగా 'రంగ్ దే'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే నైజాంలో ఈ చిత్రం రూ. 7.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.6 కోట్లు, ఆంధ్రాలో రూ. 10 కోట్లతో రెండు రాష్ట్రాల్లో రూ. 21.20 కోట్ల వ్యాపారం జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్లో రూ. 1.50 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 23.90 కోట్ల మేర బిజినెస్ నమోదైంది.
ఆరో రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత వచ్చిందంటే?
'రంగ్ దే' మూవీ ఆరో రోజు కలెక్షన్లు మరింతగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 23 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1.50 లక్షలు, కృష్ణాలో రూ. 1.60 లక్షలు, నెల్లూరులో రూ. 60 వేలతో తెలుగు రాష్ట్రాల్లో బుధవారం రూ. 44 లక్షలు షేర్, రూ. 70 లక్షలు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.
ఆరు రోజులకు కలిపి ఎంత మేర రాబట్టింది?
'రంగ్ దే' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ మంచి స్పందననే అందుకున్నా.. మంగళవారం నుంచి డ్రాప్ అవుతోంది. మొదటి రోజు రూ. 4.62 కోట్లు, రెండో రోజు రూ. 2.54 కోట్లు.. మూడో రోజు రూ. 2.88 కోట్లు, నాలుగో రోజు రూ. 1.51, ఐదో రోజు రూ. 73 లక్షలు, ఆరో రోజు రూ. 44 లక్షలతో మొత్తంగా రూ. 12.72 కోట్లు షేర్, రూ. 20.50 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే 'రంగ్ దే'.. మిగిలిన ప్రాంతాల్లోనూ ఒకే రకమైన స్పందనను అందుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణలో ఆరు రోజులకు రూ. 12.72 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 72 లక్షలు, ఓవర్సీస్లో రూ. 1.70 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా 6 రోజులకు రూ. 15.14 కోట్లు షేర్, రూ. 26.20 కోట్లు గ్రాస్ వచ్చింది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?
ప్రపంచ వ్యాప్తంగా 'రంగ్ దే' బిజినెస్ రూ. 23.90 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 24.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఆరు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.14 కోట్లు వసూలు అయ్యాయి. దీంతో ఈ చిత్రం హిట్‌గా నిలవాలంటే మరో రూ. 9.36 కోట్లు కలెక్ట్ చేయాలి. టాక్ బాగున్నా.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ చిత్రానికి ప్రతికూల ఫలితం వచ్చేలా ఉంది.