Rang De First Week Collections: ఊహించని విధంగా కలెక్షన్లు.. రూ. 25 కోట్ల టార్గెట్.. వచ్చింది ఇంతే!
టాలీవుడ్‌లో ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకున్న అతడు.. క్రమంగా తన హవాను కోల్పోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఇష్క్'తో కమ్‌బ్యాక్ అవడంతో పాటు అప్పటి నుంచి మిక్స్‌డ్ ఫలితాలతో ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'భీష్మ'తో భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. అయితే, ఈ సంవత్సరం మాత్రం 'చెక్'తో షాక్‌కు గురైన అతడు ప్రస్తుతం 'రంగ్ దే' అంటూ వచ్చాడు. ఈ మూవీ మొదటి వారం కలెక్షన్ల రిపోర్టుపై మీరూ ఓ లుక్కేయండి!
Recommended Video

అప్పుడే రెండోది.. ‘రంగ్ దే' అంటోన్న నితిన్
టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో యూత్ స్టార్ నితిన్ నటించిన చిత్రమే 'రంగ్ దే'. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు. 'చెక్' వంటి డిజాస్టర్ మూవీ తర్వాత.. ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రం గత వారం విడుదలైంది.

వాటితో పెరిగిన అంచనాలు.. బిజినెస్ భారీగా
పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్‌ల కారణంగా 'రంగ్ దే'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే నైజాంలో ఈ చిత్రం రూ. 7.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.6 కోట్లు, ఆంధ్రాలో రూ. 10 కోట్లతో రెండు రాష్ట్రాల్లో రూ. 21.20 కోట్ల వ్యాపారం జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 23.90 కోట్ల మేర బిజినెస్ నమోదైంది.

ఏడో రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత వచ్చిందంటే?
'రంగ్ దే' మూవీ ఏడో రోజు కలెక్షన్లు మరింతగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 18 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 1.20 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 3.40 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షతో తెలుగు రాష్ట్రాల్లో గురువారం రూ. 38 లక్షలు షేర్, రూ. 60 లక్షలు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

వారం రోజులకు కలిపి ఎంత మేర రాబట్టింది?
'రంగ్ దే' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ మంచి స్పందననే అందుకున్నా.. మంగళవారం నుంచి డ్రాప్ అవుతోంది. 1వ రోజు రూ. 4.62 కోట్లు, 2వ రోజు రూ. 2.54 కోట్లు.. 3వ రోజు రూ. 2.88 కోట్లు, 4వ రోజు రూ. 1.51, 5వ రోజు రూ. 73 లక్షలు, 6వ రోజు రూ. 44 లక్షలు 7వ రోజు రూ. 38 లక్షలతో మొత్తంగా రూ. 13.10 కోట్లు షేర్, రూ. 21.10 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే 'రంగ్ దే'.. మిగిలిన ప్రాంతాల్లోనూ ఒకే రకమైన స్పందనను అందుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణలో ఏడు రోజులకు రూ. 13.10 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 74 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.74 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా 7 రోజులకు రూ. 15.58 కోట్లు షేర్, రూ. 27 కోట్లు గ్రాస్ వచ్చింది.



Click it and Unblock the Notifications











