Don't Miss!
- News ఐరాస భద్రతామండలిలో భారత్ కు శాశ్వత హోదా- ఎలాన్ మస్క్ డిమాండ్ కు బైడెన్ ఓకే..!
- Finance Gold Price: శుభవార్త.. ఆకాశం నుంచి విరిగిపడ్డ బంగారం ధర.. షాపింగ్ షురూ చేసేయండి..
- Sports లేడీ ఫ్యాన్ అందాన్ని చూసి కంట్రోల్ తప్పిన గిల్ Video
- Technology షియోమీ ప్రత్యేక ఈవెంట్.. బడ్స్ 5A, ప్యాడ్ SE సహా కీలక ఉత్పత్తుల విడుదల.. పూర్తి వివరాలు..!
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
Rang De 9 Days Collections: నితిన్‌కు వరుస ఎదురుదెబ్బలు.. వచ్చింది ఇంతే.. ఇంకా రావాల్సింది ఎంతంటే!
తెలుగులో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయే హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. వేగంగా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేస్తుంటాడు. ఈ ఏడాది ఇప్పటికే 'చెక్' అనే సినిమాను విడుదల చేసిన ఈ యంగ్ హీరో.. ఇటీవల 'రంగ్ దే' అనే మరో సినిమాతో వచ్చాడు. ఎన్నో అంచనాడ నడుమ విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం ఆశించిన రీతిలో రావడం లేదు. దీంతో టార్గెట్ అలాగే ఉండిపోయింది. ఇక, ఈ మూవీ రిపోర్టును చూస్తే....
నైనా గంగూలీ.. ప్రతి ఫ్రేమ్ లో హాట్ నెస్ డోస్ పెంచేస్తోంది
ఒక హిట్.. ఒక ఫ్లాప్ తర్వాత ‘రంగ్ దే' రిలీజ్
లవ్ స్టోరీలతో యూత్‌లో మంచి గుర్తింపును తెచ్చుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరితో యూత్ స్టార్ నితిన్ నటించిన చిత్రమే 'రంగ్ దే'. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు.
వాటితో పెరిగిన అంచనాలు.. బిజినెస్ భారీగా
పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ల కారణంగా 'రంగ్ దే'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే నైజాంలో ఈ చిత్రం రూ. 7.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.6 కోట్లు, ఆంధ్రాలో రూ. 10 కోట్లతో రెండు రాష్ట్రాల్లో రూ. 21.20 కోట్ల వ్యాపారం జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్లో రూ. 1.50 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 23.90 కోట్ల మేర బిజినెస్ నమోదైంది.
9వ రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత వచ్చిందంటే?
'రంగ్ దే' మూవీ తొమ్మిదో రోజు కలెక్షన్లు బాగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 8 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1 లక్షలు, వెస్ట్‌లో రూ. 70 వేలు, గుంటూరులో రూ. 1.20 లక్షలు, కృష్ణాలో రూ. 1.20 లక్షలు, నెల్లూరులో రూ. 60 వేలతో తెలుగు రాష్ట్రాల్లో శనివారం రూ. 17 లక్షలు షేర్, రూ. 31 లక్షలు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.
తొమ్మిది రోజులకు కలిపి ఎంత మేర రాబట్టింది?
'రంగ్ దే' మంచి టాక్ ఉన్నా కలెక్షన్ల పరంగా డ్రాప్ అవుతోంది. 1వ రోజు రూ. 4.62 కోట్లు, 2వ రోజు రూ. 2.54 కోట్లు.. 3వ రోజు రూ. 2.88 కోట్లు, 4వ రోజు రూ. 1.51, 5వ రోజు రూ. 73 లక్షలు, 6వ రోజు రూ. 44 లక్షలు 7వ రోజు రూ. 38 లక్షలు, 8వ రోజు రూ. 29 లక్షలు, 9వ రోజు రూ. 17 లక్షలతో రెండు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 13.56 కోట్లు షేర్, రూ. 22 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే 'రంగ్ దే'.. మిగిలిన ప్రాంతాల్లోనూ ఒకే రకమైన స్పందనను అందుకుంది. ఆంధ్రా ప్లస్ తెలంగాణలో తొమ్మిది రోజులకు రూ. 13.56 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 76 లక్షలు, ఓవర్సీస్లో రూ. 1.78 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా 9 రోజులకు రూ. 16.10 కోట్లు షేర్, రూ. 28 కోట్లు గ్రాస్ వచ్చింది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?
ప్రపంచ వ్యాప్తంగా 'రంగ్ దే' బిజినెస్ రూ. 23.90 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 24.50 కోట్లుగా నమోదైంది. ఇక, తొమ్మిది రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.10 కోట్లు వసూలు అయ్యాయి. దీంతో ఈ చిత్రం హిట్‌గా నిలవాలంటే మరో రూ. 8.40 కోట్లు కలెక్ట్ చేయాలి. టాక్ బాగున్నా.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం.. కొత్త సినిమాలు రావడం ప్రతికూలంగా మారింది.