Rang De Overseas Pre release Business: నితిన్, కీర్తి సురేష్ స్టామినాకు తగినట్టుగా!
చెక్ మూవీ తర్వాత యువ హీరో నితిన్ నటించిన రంగ్ దే చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అవుతున్నది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ప్రేమ కథా చిత్రం మార్చి 26వ తేదీన రిలీజ్‌కు సిద్ధమైంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతోపాటు బిజినెస్ వ్యవహారాలు కూడా క్రేజీగా మారాయి.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత నాగవంశీ రూపొందించిన ఈ చిత్రం ఓవర్సీస్ హక్కుల రికార్డు ధరకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ హక్కులను ఫార్స్ ఫిల్మ్స్ దక్కించుకొన్నది. ఈ చిత్రం హక్కులను 1.5 కోట్లకు ఫార్స్ ఫిల్మ్స్ చేజిక్కించుకొన్నట్టు సమాచారం. అయితే మీడియం రేంజ్ సినిమాల్లో ఇంత ధర పలకడంపై క్రేజీగా మారింది.

ఇక నితిన్‌కు రంగ్ దే సినిమా ప్రత్యేకంగా నిలువనున్నది. నితిన్‌కు సంబంధించి లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతున్న రెండో సినిమా రంగ్ దే. ఈ సినిమాపై భారీ ఆశలను సినిమా యూనిట్ పెట్టుకొన్నది.
నటీనటులు: నితిన్, కీర్తీ సురేష్, నరేష్, కౌసల్య, రోహిణి, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, వినీత్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురాం తదితరులు.
దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
రచయిత: వెంకీ అట్లూరి, పీ సతీష్ చంద్ర
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫి: పీసీ శ్రీరాం
ఎడిటింగ్: నవీన్ నూలీ
బ్యానర్: సితారా ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2021-03-26


Click it and Unblock the Notifications











