Robinhood Day 1 Collection : టఫ్ ఫైట్ మధ్య నితిన్ వసూళ్ల వేట.. రాబిన్‌హుడ్‌ ఓపెనింగ్స్ ఎన్ని కోట్లంటే?

23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న నితిన్‌కు ఇది నా సినిమా అని కాలరెగరేసి చెప్పుకునే చిత్రాలు పడటం లేదు. ఇన్నేళ్ల కెరీర్‌లో జయం, ఇష్క్, దిల్, గుండెజారి గల్లంతయ్యిందే, అఆ, రంగ్ దే తప్పించి ఆయనకు సరైన హిట్ లేదు. నిన్న గాక మొన్న వచ్చిన హీరోలు కూడా అలవోకగా రూ.100 కోట్ల కలెక్షన్స్‌ను కొట్టేస్తుంటే నితిన్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా బండి నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ హిట్ కోసం నితిన్ చేసిన ప్రయత్నమే రాబిన్‌హుడ్.

రేసులో నిలబడాలంటే సాలీడ్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయిన నితిన్.. తనకు భీష్మ వంటి విజయాన్ని అందించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఆయన నటించారు. శ్రీలీల ఈ సినిమాలో నితిన్ సరసన ఆడిపాడారు. వెన్నెల కిషోర్, రాజేంద్రపస్రాద్, దేవదత్త నాగె, టామ్ చాకో, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ , ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి రాబిన్‌హుడ్‌ చిత్రాన్ని రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

Nithiin s robinhood Movie Worldwide Box Office Day 1 Expected Collection Details

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌లు నిర్మాణం వహించారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ పోషించగా.. హీరోయిన్ కేతిక శర్మ స్పెషల్ సాంగ్‌లో నటించారు. రంజాన్ కానుకగా మార్చి 28న రాబిన్ హుడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితిన్ - వెంకీ కుడుముల కాంబినేషన్, డేవిడ్ వార్నర్, కేతిక శర్మలు, టీజర్, ట్రైలర్లతో రాబిన్‌హుడ్‌ మంచి హైప్ తెచ్చుకుంది. రాబిన్ హుడ్ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నితిన్ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.35 కోట్ల షేర్ , రూ. 70 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.

మంచి అంచనాల మధ్య మార్చి 27న రాబిన్‌హుడ్ సినిమాకు అమెరికాలో ప్రీమియర్స్ పడ్డాయి. అమెరికాలో శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను రిలీజ్ చేసింది. నితిన్ చిత్రం తొలి రోజున ఎన్ని కోట్లు వసూలు చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. మార్నింగ్ షోలకు 19.62 శాతం, మ్యాట్నీలకు 21.84 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 1.20 కోట్ల రాబట్టినట్లు సాక్‌నిక్. కామ్ తెలిపింది. ఆఫ్‌లైన్ లెక్కలను కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా రాబిన్ హుడ్ తొలిరోజున రూ.3 కోట్ల మేర ఓపెనింగ్స్ రాబట్టొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

అయితే మోహన్ లాల్ ఎల్ 2 : ఎంపురాన్, విక్రమ్ నటించిన వీర ధీర శూర, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మ్యాడ్ స్క్వేర్‌ల నుంచి ఈ సినిమాకు గట్టి పోటీ ఎదురుకానుంది. అయితే వీకెండ్ కావడంతో పాటు, వరుస సెలవులు తమ సినిమాకు కలిసొస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఈ టఫ్ ఫైట్‌లో నితిన్ ఏమేరకు రాణిస్తాడో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: robinhood nithiin sreeleela
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X