Robinhood Box Office : నితిన్‌కు షాక్ .. దారుణంగా రాబిన్‌హుడ్ ఓపెనింగ్స్, ఎన్ని కోట్లంటే?
నితిన్ - వెంకీ కుడుముల కాంబినేషన్, శ్రీలీల అందాలు, కేతిక శర్మ ఐటెం సాంగ్, శేఖర్ మాస్టర్ స్టెప్పులతో కాంట్రవర్సీ, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్, రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు ఇలా ఎన్నో అంశాలకు కేంద్ర బిందువుగా మారింది రాబిన్‌హుడ్ చిత్రం. మోహన్‌లాల్, విక్రమ్ వంటి సూపర్‌స్టార్లతో పోటీపడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలాంటి సంచలనాలు అందుకుంది. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఎంత రాబట్టిందో చూస్తే.
శ్రీలీల ఈ సినిమాలో నితిన్ సరసన నటించారు. వెన్నెల కిషోర్, రాజేంద్రపస్రాద్, దేవదత్త నాగె, టామ్ చాకో, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీలు కీలకపాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ , ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి రాబిన్‌హుడ్ చిత్రాన్ని రూ.60 కోట్ల బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రంజాన్ కానుకగా మార్చి 28న రాబిన్ హుడ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలు, కాంట్రవర్సీలతో రాబిన్‌హుడ్ చిత్ర సీమలో భారీ అంచనాలను అందుకుంది. ప్రీ రిలీజ్ బిజినెస్‌పరంగానూ నితిన్ కెరీర్‌లో హయ్యెస్ట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్ల మేర ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నితిన్ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.35 కోట్ల షేర్ , రూ. 70 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. అయితే రాబిన్‌హుడ్ సినిమా దాదాపు రూ.60 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కారణంగా రూ.130 కోట్ల గ్రాస్ అందుకోవాల్సిన అవసరం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఎల్ 2 : ఎంపురాన్, వీర ధీర శూర తదితర చిత్రాలు థియేటర్‌లలో ఉన్నప్పటికీ నితిన్ చిత్రం మంచి హోల్డ్ సాధించింది. మార్నింగ్ షోలలో 19.62 శాతం, మ్యాట్నీలకు 21.84 శాతం, ఫస్ట్ షోలకు 16.62 శాతం, నైట్ షోలకు 28.15 శాతం చొప్పున ఓవరాల్‌గా 21.56 శాతం మేర థియేటర్‌లలో ఆక్యూపెన్సీ అందుకున్నాడు నితిన్. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2 కోట్ల ఓపెనింగ్స్ అందుకున్నట్లు సాక్‌నిక్.కామ్ వెల్లడించింది. ఆఫ్‌లైన్ సేల్స్ లెక్కలు కూడా చూసుకుంటే ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న రాబిన్‌హుడ్‌కు మ్యాడ్ స్క్వేర్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. నితిన్ చివరి చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ తన థియేట్రికల్ రన్ ముగిసేసరికి రూ.9.70 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు రాబిన్‌హుడ్ చిత్రానికి అయిన బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూసుకుంటే నితిన్ సినిమా క్లీన్ హిట్ కావాలంటే ఏకంగా ఎక్స్‌ట్రా ఆర్డీననీ మ్యాన్ కంటే దాదాపు 1343.3 శాతం వసూళ్లు కలెక్ట్ చేయాలని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వరుస సెలవులు, పండుగలలోనే నితిన్ ఎక్కువ మొత్తం రాబట్టాల్సి ఉంది. మరి ఈ సీజన్‌ను రాబిన్‌హుడ్ ఎలా క్యాష్ చేసుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











