Robinhood Day 2 Collection : నితిన్ అపసోపాలు.. షాకిచ్చేలా రాబిన్‌హుడ్‌ కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే?

హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు నితిన్. అప్పుడెప్పుడో భీష్మ, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ తదితర చిత్రాల తర్వాత మళ్లీ హిట్ చూడలేదు నితిన్. ఒక్క హిట్ పడితే .. నాలుగు ఫ్లాప్‌లు అన్నట్లుగా ఆయన కెరీర్ సాగుతోంది. కెరీర్ ట్రాక్‌లోకి రావాలంటే హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయిన నితిన్ తనకు భీష్మ వంటి హిట్ అందించిన వెంకీ కుడుములతో జత కలిశాడు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన చిత్రమే రాబిన్‌హుడ్. విడుదలకు ముందే ఎన్నో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రెండో రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

రాబిన్‌హుడ్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. వెన్నెల కిషోర్, రాజేంద్రపస్రాద్, దేవదత్త నాగె, టామ్ చాకో, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీలు కీలకపాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు అందించగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవిశంకర్ యలమంచిలి, నవీన్ యెర్నేనీ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ , ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి రాబిన్‌హుడ్‌ చిత్రానికి రూ.60 కోట్ల బడ్జెట్‌ అయ్యింది. రంజాన్ కానుకగా మార్చి 28న రాబిన్ హుడ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

Nithiin s robinhood Movie Worldwide Day 2 Box Office Collection Details

టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో పాటు కేతిక శర్మ హుక్ స్టెప్, డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ కలిపి ఈ సినిమాపై చర్చ జరిగేలా చేయడంతో పాటు భారీ హైప్ తీసుకొచ్చింది. దీని కారణంగా నితిన్ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఆయన కెరీర్‌లోనే తొలిసారిగా రూ.30 కోట్ల మేర వ్యాపారం చేసింది. రాబిన్‌హుడ్ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.35 కోట్ల షేర్ , రూ. 70 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

తొలిరోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న రాబిన్‌హుడ్‌కు ఎల్ 2 : ఎంపురాన్, వీర ధీర శూర, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదురైంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది పర్వాలేదనిపించింది. ఇక రెండో రోజూ నితిన్ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే.. మార్నింగ్ షోలకు 12.32 శాతం, మ్యాట్నీలకు 22.17 శాతం, ఫస్ట్ షోలకు 20.47 శాతం, సెకండ్ షోలకు 24.34 శాతం చొప్పున ఓవరాల్‌గా 19.83 శాతం ఆక్యూపెన్సీ సొంతం చేసుకుంది.

హైదరాబాద్‌లో 313, బెంగళూరులో 230, విశాఖపట్నంలో 102 షోలు పడ్డాయి. రాబిన్‌హుడ్‌కు రెండు రోజుల్లో కలిపి 28కే టికెట్లు అమ్ముడైనట్లుగా ప్రముఖ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ బుక్ మై షో తెలిపింది. 2025లో బుక్ మై షోలో అత్యధికంగా టికెట్ సేల్స్ నమోదు చేసిన చిత్రాల్లో రాబిన్ హుడ్ ఇప్పటి వరకు 8వ స్థానంలో నిలిచింది. ఐఎండీబీలో ఈ సినిమాకు 5.1 రేటింగ్ దక్కింది. రెండో రోజు రాబిన్‌హుడ్ చిత్రానికి రూ.2.25 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు సాక్‌నిక్ వెల్లడించింది.

ఆఫ్‌లైన్ టికెట్ సేల్స్ కలిపి ఇది రూ.2.50 కోట్లుగా ఉంటుందని తద్వారా రెండు రోజులకు కలిపి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.4.60 కోట్లు రాబట్టింది. అయితే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్‌కు, వస్తున్న కలెక్షన్స్‌కు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

More from Filmibeat

Read more about: robinhood nithiin sreeleela
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X