Robinhood Day 3 Collection : రేసులో వెనుకబడ్డ నితిన్ .. రాబిన్‌హుడ్‌కి షాకింగ్ కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే?
సెట్స్ మీదకు వెళ్లిన నాటి నుంచి సంచలనాలకు కేంద్రంగా నిలిచింది యంగ్ హీరో నితిన్ నటించిన రాబిన్‌హుడ్ చిత్రం. కేతికా శర్మ హుక్ స్టెప్పులు వివాదాస్పదం కావడంతో మహిళా సంఘాలు మండిపడ్డాయి. దేశవ్యాప్తంగా ఈ స్టెప్స్‌పై చర్చ జరిగింది. ఇక ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో నటించడం సినీ, క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరిగింది. ఇన్ని సంచలనాలు ఉండటంతో రాబిన్‌హుడ్ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.
మోహన్‌లాల్ ఎల్ 2 : ఎంపురాన్, విక్రమ్ వీర ధీర శూర, మ్యాడ్ స్క్కేర్ వంటి సినిమాల మధ్య టఫ్ ఫైట్‌లో విడుదలైన రాబిన్‌హుడ్ కలెక్షన్స్‌పై అందరి దృష్టి నెలకొంది. హిట్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నితిన్ ఈ సమయంలో రావడం అవసరమా? అన్న విశ్లేషణలు వచ్చాయి. తొలి రెండు రోజులు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్లే అందుకున్నాడు నితిన్. ఈ నేపథ్యంలో మూడో రోజు రాబిన్‌హుడ్ ఎలాంటి కలెక్షన్స్ సాధించిందో చూస్తే :

రాబిన్‌హుడ్‌లో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. వెన్నెల కిషోర్, రాజేంద్రపస్రాద్, దేవదత్త నాగె, టామ్ చాకో, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీలు కీలకపాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు అందించగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ , ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి రాబిన్‌హుడ్ చిత్రానికి రూ.60 కోట్ల బడ్జెట్ అయ్యింది. రంజాన్ కానుకగా మార్చి 28న రాబిన్ హుడ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
అన్ని రకాల అంశాలు కలిసొచ్చి నితిన్ కెరీర్‌లోనే ఎన్నడూ లేని విధంగా రూ.30 కోట్ల మేర ప్రీ రిలీజ్ వ్యాపారం చేసింది రాబిన్‌హుడ్. దాంతో ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.35 కోట్ల షేర్ , రూ. 70 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. తొలి రోజు రూ.2.3 కోట్లు, రెండో రోజు రూ.2.05 కోట్లు మాత్రమే రాబట్టిన రాబిన్‌హుడ్ ఇంకా రికవరీ చేయాల్సిన మొత్తం చాలానే ఉంది. రాబిన్‌హుడ్‌కు రూ.70 కోట్ల బడ్జెట్ అవ్వగా.. శనివారం నాటి వసూళ్లతో కలిపి నితిన్ రూ.4.50 కోట్లతో 6.30 శాతం రికవరీ మాత్రమే సాధించాడు. అంటే ఇంకా కొండంత లక్ష్యం ఉండటంతో దానిని బ్రేక్ చేయడం నితిన్‌కు పెద్ద టాస్క్‌గా మారింది.
ఇక మూడో రోజు వసూళ్ల విషయానికి వస్తే.. ఆదివారం మార్నింగ్ షోలకు డల్‌గా సాగిన బుకింగ్ .. సెకండ్ షో నాటికి ఊపందుకుంది. ఉదయం ఆటలకు 13.85 శాతం, మ్యాట్నీలకు 29.75 శాతం, ఫస్ట్ షోలకు 33.89 శాతం, సెకండ్ షోలకు 36.40 శాతం చొప్పున ఓవరాల్‌గా 28.47 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 331, బెంగళూరులో 207, విశాఖలో 113, విజయవాడలో 64 షోలు పడ్డాయి.
ప్రపంచవ్యాప్తంగా రాబిన్‌హుడ్ మూడో రోజు రూ.2.75 కోట్ల వసూళ్లు సాధించినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఆఫ్‌లైన్ టికెట్ సేల్స్‌తో కలిపి ఇది రూ.3 కోట్ల వరకు ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొత్తంగా మూడు రోజుల వరకు రాబిన్‌హుడ్ చిత్రం రూ.7.25 కోట్ల గ్రాస్ రాబట్టింది. సోమవారం రంజాన్ పర్వదినం కావడంతో నితిన్ చిత్రానికి వసూళ్లు బాగుంటాయని అంచనా వేస్తున్నారు. మరి రాబిన్‌హుడ్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











