Robinhood Day 4 Collection : కోలుకోని రాబిన్‌హుడ్.. దారుణంగా వసూళ్లు, నితిన్ మూవీకి ఎన్ని కోట్లంటే?
మంచి హైప్‌తో ప్రేక్షకులను పలకరించాడు నితిన్. తనకు భీష్మ వంటి మెమొరబుల్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ యువ హీరో నటించిన చిత్రమే రాబిన్‌హుడ్. రంజాన్, ఉగాది పర్వదినాల కానుకగా మార్చి 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. డేవిడ్ వార్నర్ క్యామియో, కేతిక శర్మ మాస్ సాంగ్స్, రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలతో బోల్డెంత హైప్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద రాబిన్‌హుడ్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో నాలుగో రోజు నితిన్ - శ్రీలీల చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
రాబిన్‌హుడ్‌లో వెన్నెల కిషోర్, రాజేంద్రపస్రాద్, దేవదత్త నాగె, టామ్ చాకో, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీలు కీలకపాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యం వహించింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ , ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి రాబిన్‌హుడ్ చిత్రానికి రూ.60 కోట్ల బడ్జెట్ అయ్యింది. కాంట్రవర్సీలు, ప్రమోషన్ కార్యక్రమాల కారణంగా రాబిన్‌హుడ్‌కు దాదాపు రూ. 30 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.35 కోట్ల షేర్ , రూ.70 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు నిర్దేశంచారు.

మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న రాబిన్‌హుడ్ తొలి మూడు రోజుల్లో రూ. 7 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే అందుకుని షాకిచ్చింది. వీకెండ్ డిజప్పాయింట్ చేయడంతో రంజాన్ పర్వదినంపై చిత్ర యూనిట్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి రాబిన్‌హుడ్ కలెక్షన్ల వివరాలు పరిశీలిస్తే. ఆక్యూపెన్సీ పరంగానూ నితిన్ సినిమా మెరుగ్గా రాణించలేకపోయింది. మార్నింగ్ షోలకు 10.62 శాతం, మ్యాట్నీలకు 22.39 శాతం, ఫస్ట్ షోలకు 22.01 శాతం, సెకండ్ షోలకు 21.17 శాతం చొప్పున ఓవరాల్‌గా 19.05 శాతం ఆక్యూపెన్సీ మాత్రమే అందుకుంది రాబిన్‌హుడ్.
నాలుగో రోజు హైదరాబాద్‌లో 269 షోలు, బెంగళూరులో 180 షోలు, విశాఖలో 94 షోలు, విజయవాడలో 53 షోలు పడ్డాయి. మొత్తంగా రంజాన్ పండుగను రాబిన్‌హుడ్ చిత్రం క్యాష్ చేసుకోలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.1.04 కోట్లు మాత్రమే అందుకున్నట్లు సాక్‌నిక్ తెలిపింది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్‌తో కలిపి ఇది రూ.1.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మొత్తంగా నాలుగు రోజుల వరకు నితిన్ చిత్రం రూ.8.14 కోట్ల గ్రాస్ రాబట్టింది.
వీకెండ్, ఈద్ సమయంలోనే పరిస్ధితి ఇలా ఉంటే వర్కింగ్ డేస్‌లో నితిన్ నిలదొక్కుకోవడం కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాబిన్‌హుడ్ మూవీ ఇంకా 90 శాతం రికవరీని సాధించాల్సి ఉంది. మరి నితిన్ ఏం చేస్తాడో చూడాలి. ఎల్ 2 : ఎంపురాన్, వీర ధీర సూర, సికందర్, మ్యాడ్ స్క్వేర్‌ల వంటి చిత్రాల పోటీని తట్టుకుని నితిన్ సినిమా నిలబడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏమాత్రం అటు ఇటైనా నితిన్‌కు, మైత్రీ మూవీ మేకర్స్‌కు కోలుకోలేని దెబ్బ గ్యారెంటీ అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











