బీ రెడీ:నితిన్ రచ్చకు రంగం సిద్దమైంది
హైదరాబాద్: నితిన్ హీరోగా శ్రేష్ట్ మూవీస్ సంస్థ ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘చిన్నదాన నీ కోసం'. సుధాకర్‌రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మాతలు. విక్రమ్‌గౌడ్ సమర్పకుడు. ఈ నెల 27న పాటల్ని విడుదల చేస్తున్నారు. డిసెంబరు 19న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ ''అనుభూతిని నింపే ఒక అందమైన ప్రేమకథ ఇది. కరుణా కరన్ శైలిలోనే ప్రతీ సన్నివేశం ఆహ్లాదాన్ని పంచుతుంది. చిన్నదాని ప్రేమకోసం కథానాయకుడు ఏం చేశాడన్నది తెరపైనే చూడాలి. ఇందులో నితిన్ కనిపించే విధానం కొత్తగా ఉంటుంది. అనూప్‌రూబెన్స్ సంగీతం, హర్షవర్ధన్ మాటలు, ఆండ్రూ కెమెరా పనితనం చిత్రానికి ప్రధాన బలం. 27న ప్రముఖ హీరోల సమక్షంలో అట్టహాసంగా పాటల వేడుక జరుగుతుంది. ''అన్నారు.

‘మా గత చిత్రాలు ‘ఇష్క్', ‘గుండె జారి గల్లంతయ్యిందే' మించి సంగీతాన్ని అనూప్ రూబెన్స్ అందించారు. ఆండ్రూ కెమెరా, హర్షవర్ధన్ మాటలు ఈ చిత్రానికి ప్లస్ అవుతాయని మరో నిర్మాత నికితారెడ్డి చెప్పారు. అలాగే..... ఈ సినిమా ఇండియాతో పాటూ అబ్రాడ్లోనూ భారీ వ్యయంతో చిత్రీకరణ జరుపుకుంటుంది. శ్రేస్ట్ మూవీస్‌లో గతంలో వచ్చిన "ఇష్క్", "గుండేజారి గల్ల౦తయ్యి౦దే" లా౦టి విజయాల అన౦తర౦ తీస్తున్న ఈ మూడో సినిమా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని తెలిపారు.
‘గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాకు హిట్ సినిమా సాంగ్స్ లో లైన్ ని టైటిల్ గా ఎంచుకున్న నితిన్ ఈ సినిమాకి కూడా తన ఇష్క్ సినిమాలోని ఓ పాటలోని ‘చిన్నదాన నీ కోసం' అనే ఫేమస్ లైన్ ఎంచుకోవడంతో ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంగా ఉన్నారు.
ఈ చిత్రంలో నితిన్ సరసన బాలీవుడ్ భామ మిస్తి హీరోయిన్ గా నటిస్తోంది. ఎప్పుడు రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో ఆకట్టుకునే కరుణాకరన్ ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని కూడా మిక్స్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. నితిన్ హోం బ్యానర్ అయిన శ్రేష్ఠ్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

శ్రేస్ట్ మూవీస్ పతాకం మీద నిఖితారెడ్డి, సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విక్రమ్ గౌడ్ సమర్పకులు. నితిన్ సరసన బాలీవుడ్ హీరోయిన్ మిస్తీ జోడి కడుతోంది. ఈ చిత్రంలో ఆలీ, నరేశ్, సితార, మధునందన్ ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, సంగీతం: అనుప్ రూబెన్స్, సినిమాటోగ్రఫి: ఆండ్రూ, ఆర్ట్ రాజీవ్ నాయర్, సమర్పణ: విక్రమ్ గౌడ్.


Click it and Unblock the Notifications











