twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ ఇదిగో(ఫొటో)

    By Srikanya
    |

    హైదరాబాద్: గోడకు కొట్టిన బంతిలా...కంటిన్యూ ఫ్లాపుల నుంచి కోలుకుని వరస పెట్టి హిట్స్ ఇవ్వటం మొదలెట్టిన నితిన్ ఇంకో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. లవ్ ఎంటర్టైనర్స్ చేయడంలో మంచి పేరున్న కరుణాకరన్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుస్తున్నారు. జూన్ లో సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. 35 రోజుల కంటిన్యూ యూరప్ షెడ్యూల్ తో 90% పూర్తి చేసుకుంది. ‘చిన్నదాన నీ కోసం' అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసి, విడుదల తేదీని ఖరారు చేసారు.

    ఈ చిత్రాన్ని డిసెంబర్ 19 న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాకు హిట్ సినిమా సాంగ్స్ లో లైన్ ని టైటిల్ గా ఎంచుకున్న నితిన్ ఈ సినిమాకి కూడా తన ఇష్క్ సినిమాలోని ఓ పాటలోని ‘చిన్నదాన నీ కోసం' అనే ఫేమస్ లైన్ ఎంచుకోవడంతో ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంగా ఉన్నారు.

    Nithin's next on Dec 19

    ఈ చిత్రంలో నితిన్ సరసన బాలీవుడ్ భామ మిస్తి హీరోయిన్ గా నటిస్తోంది. ఎప్పుడు రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో ఆకట్టుకునే కరుణాకరన్ ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని కూడా మిక్స్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. నితిన్ హోం బ్యానర్ అయిన శ్రేష్ఠ్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

    నిర్మాత నికితా రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా ఇండియాతో పాటూ అబ్రాడ్లోనూ భారీ వ్యయంతో చిత్రీకరణ జరుపుకుంటుంది. శ్రేస్ట్ మూవీస్‌లో గతంలో వచ్చిన "ఇష్క్", "గుండేజారి గల్ల౦తయ్యి౦దే" లా౦టి విజయాల అన౦తర౦ తీస్తున్న ఈ మూడో సినిమా కూడా గ్రాండ్‌ సక్సెస్‌ అవుతుందని తెలిపారు.

    శ్రేస్ట్ మూవీస్ పతాకం మీద నిఖితారెడ్డి, సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విక్రమ్‌ గౌడ్ సమర్పకులు. నితిన్ సరసన బాలీవుడ్‌ హీరోయిన్ మిస్తీ జోడి కడుతోంది. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, సంగీతం: అనుప్ రూబెన్స్, సినిమాటోగ్రఫి: ఆండ్రూ, ఆర్ట్ రాజీవ్ నాయర్, సమర్పణ: విక్రమ్‌ గౌడ్‌.

    English summary
    Niti's CHINNADANA NEE KOSAM film's Shoot is now complete by 90% after 35 Days Europe Schedule. The makers announced it will release for Dec 19.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X