బాక్సాఫీస్: నితిన్ కెరీర్‌లో సెకండ్ హైయెస్ట్ ఓపెనింగ్స్.. శ్రీనివాస కళ్యాణం కలెక్షన్స్!
యంగ్ హీరో నితిన్, అందాల తార రాశి ఖన్నా జంటగా నటించిన శ్రీనివాస కళ్యాణం చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెళ్లి విశిష్టతని తెలియజేసే అంశతో ఈ చిత్ర కథ రూపొందించారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ చిత్రం బాగా కట్టుకుంటోంది. దర్శకుడు సతీష్ వేగేశ్న రాసిన సంభాషణలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా మొత్తం కలర్ ఫుల్ గా సాగడం, వివాహానికి సంబంధించిన సన్నివేశాలు అందంగా ఉండడంతో, పాటల చిత్రీకరణ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన అంశాలు. తొలి రోజు శ్రీనివాస కళ్యాణం చిత్రం మంచి వసూళ్ళని రాబట్టింది.

సెకండ్ హైయెస్ట్
తొలి రోజు వసూళ్ల పరంగా శ్రీనివాస కళ్యాణం చిత్రం నితిన్ కెరీర్ లో రెండవ అతిపెద్ద చిత్రంగా నిలిచింది. తొలిరోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఇందులో 3 కోట్లకు పైగా షేర్ ఉండడం విశేషం.

నైజాంలో అత్యధికంగా
శ్రీనివాస కళ్యాణం చిత్రం నైజాం ఏరియాలో అత్యధికంగా 1.17 కోట్ల షేర్ తొలిరోజు రాబట్టింది. నిర్మాత దిల్ రాజు స్యయంగా ఈ చిత్రాన్ని నైజాంలో విడుదల చేశారు.

ఆంధ్ర ప్రాంతంలో
వైజాగ్ లో 32 లక్షలు, ఈస్ట్ లో 23, వెస్ట్ లో 15 లక్షలు శ్రీనివాస కళ్యాణం చిత్రం తొలిరోజు రాబట్టింది. సీడెడ్ లో 37 లక్షలు, గుంటూరులో 27, కృష్ణ లో 16 లక్షలు రాబట్టడం విశేషం.

ఓవర్సీస్
శ్రీనివాస కళ్యాణం చిత్రం ఓవర్సీస్ లో యావరేజ్ గా బాక్స్ ఆఫీస్ వసూళ్లు వస్తున్నారు. తొలి రోజు ఈ చిత్రం యూఎస్ లో 20 లక్షలు వసూలు చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా వసూళ్లు 23 లక్షలు.

వీకెండ్
వీకెండ్ లోపు శ్రీనివాస కళ్యాణం చిత్రం సాధించే వసూళ్ళని బట్టి ఈ చిత్ర రిజల్ట్ పై ఓ అంచనాకు రావచ్చు. ఆగష్టు 15 న గీత గోవిందం చిత్రం విడుదుల కానున్న నేపథ్యంలో ఈ లోపే శ్రీనివాస కళ్యాణం చిత్రం ఎక్కువగా వసూళ్లు రాబట్టాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











