పవన్,త్రివిక్రమ్ చిత్రం నైజాం రైట్స్ తీసుకున్న తెలుగు హీరో

By Srikanya

హైదరాబాద్: పవన్ కళ్యాణ్....త్రివిక్రమ్‌తో చేస్తున్న తన తాజా సినిమా ట్రేడ్ లో మళ్లీ రికార్డుల పరంపర మొదలైట్టింది. ఈ చిత్రం నైజాం రైట్స్ ఊహించని రేటుకు గ్లోబుల్ సినిమాస్ వారు తీసుకున్నారు. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా ట్వీట్ చేసారు. పవన్ కి వీరాభిమాని అయిన నితిన్ ఈ విషయమై తానే సలహా ఇచ్చి కొనిపించానన్నారు. ఇంతకీ గ్లోబల్ సినిమాస్ లో పార్టనర్స్ ..నితిన్, వాళ్ల నాన్న సుధాకర్ రెడ్డి.

నితిన్ ట్వీట్ లో.. నేను బయిటకు ఇంతని చెప్పలేను కానీ..నైజాం రైట్స్ ని మాత్రం అత్యథిక రేటుకు తీసుకున్నాం...నేనే ఈ సినిమాని కొనమని సలహా ఇచ్చాను...అని ట్వీట్ చేసారు. . . తాజాగా ఈచిత్రం ఓవర్సీస్(విదేశీ) రైట్స్ గతంలో ఏ సినిమాకు లేని విధంగా రూ. 6.70 కోట్లుకు అమ్మడయినట్లు తెలుస్తోంది. ఇంత రేటు పలకడం ఆల్ టైమ్ రికార్డుగా ట్రైడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

సినిమా వివరాల్లోకి వెళితే...ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 3 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేసారు. ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర పర్యవేక్షణలో ఈ ఖరీదైన సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా చేస్తున్నారు.

ఈచిత్రంలో పవర్ స్టార్ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడని, అతని క్యారెక్టరైజేషన్ కూల్ గా, హాస్య భరితంగా ఉంటుందని అంటుందని ఫిల్మ్ నగర్ టాక్. త్వరలో పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. 'మిర్చి' చిత్రంలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించిన నదియా ఈ సినిమాలో సమంత తల్లి పాత్రలో నటించబోతోంది. అదే విధంగా బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ కూడా ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నారు.

మరో వైపు బ్రహ్మానందం రియల్ ఎస్టేట్ దాదాగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. సినిమా ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 'అత్తారింటికి దారేది' అనే టైటిల్ వినిపిస్తున్నప్పటికీ అధికారికంగా ఈ విషయం ఖరారు కావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X