twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రేడ్ టాక్: 'ఇష్క్' కలెక్షన్స్ పరిస్దితి

    By Srikanya
    |

    రవితేజ నిప్పు, సిద్దార్ధ లవ్ ఫెయిల్యూర్ చిత్రాలు ఒకే రోజు విడుదల కాగా, సునీల్ పూల రంగడు చిత్రం మరుసటి రోజు విడుదైంది. అయితే పూల రంగడు హిట్ టాక్ తెచ్చుకుని నిలబడి పోయింది. సునీల్ తెరపై చూసిన సిక్స్ పాక్ కి జనం మంత్ర ముగ్దులు అయిపోయారు. మరో ప్రక్క ఎ సెంటర్లలోనూ,మల్టి ప్లెక్స్ లలో తెగ ఆడుతుందని సిద్దార్ద ఎంతో ఆసపడ్డ లవ్ పెయిల్యూర్ టైటిల్ కి తగ్గట్లే మిగిలిపోయింది. నిప్పు మొదటి రోజు మార్నింగ్ షో కే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. నిప్పు ఆక్యుపెన్సీ రేటు ట్వంటీ పర్శంట్ కూడా ఉండకపోవటంతో ఆ సినిమా ఆడుతున్న థియేటర్లలో చాలా చోట్ల ఇష్క్ చిత్రం వేసారు.

    మొన్న శుక్రవారం విడుదలైన నితిన్ ఇష్క్ మంచి టాక్ తెచ్చుకుంది. బి,సి సెంటర్లు ఎలా ఉన్నా ఎ సెంటర్లలో బాగా వర్కవుట్ అవుతోంది. ఫ్యామీలీలు వీకెండ్ లలో ఈ చిత్రాన్ని చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. కాలేజీ యూత్ కూడా ఈ చిత్రానికి బాగానే వస్తూండటంతో ఎగ్జిబిటర్స్ హ్యాపీగా ఉన్నారు. అలాగే సీడెడ్ లో ఇప్పటివరకూ ఏ నితిన్ చిత్రానికి రానీ కలెక్షన్స్ ఈ చిత్రానికి వచ్చాయని తెలుస్తోంది. నిత్యామీనన్ న్యాచురల్ నటన,రొమాంటిక్ కామెడీగా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చి దిద్దిన విధానం,పి సి శ్రీరామ్ కెమెరా వర్క్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. మరో ప్రక్క రాజమౌళి వంటి దర్శకుడు ఈ చిత్రాన్ని పొగుడుతూ ట్వీట్ చేయటం కూడా అందరి దృష్టినీ ఈ చిత్రంపై పడేలా చేసింది.

    English summary
    Nippu has been replaced by Ishq in many theaters.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X