twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెచ్చిపో..అంటున్న నితిన్

    By Staff
    |

    nitin
    త్వరలో ఇలియానాతో నితిన్ రెచ్చిపోవటానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. వరస ఫ్లాప్ లతో దూసుకుపోతున్న నితిన్ తాజాగా చేస్తున్న చిత్రానికి రెచ్చిపో అనే టైటిల్ ని పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పరుచూరి మురళి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాని స్పెక్ట్రా మీడియా పతాకంపై జి.వి.రమణ నిర్మిస్తున్నారు. ఇక మొదట్లో ఈ చిత్రానికి మిర్చి అనే టైటిల్ ని అనుకోవటం అనుకున్నారు. అలాగే దేవదాసు చిత్రంతో పరిచయమైన ఇలియానాతో ఎప్పుడో చేయాల్సి ఉందని, అయితే అప్పట్లో కుదరలేదని నితిన్ అంటున్నారు.

    దుబాయి లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయని అంటున్నాడు. ఇక ఇలియానాతో తాను ధైర్యం సినిమాలో చేయాల్సి ఉందని, అందునిమిత్తం ఫొటో షూట్ కూడా చేసారని, కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదంటున్నాడు. ఇక ఇది విన్న వారు నితిన్ హిట్టు లు లేక చివరకు ఇలియానా తన సినిమాలో నటిస్తోందనే విషయాన్ని హైలెట్ చేసి క్రేజ్ సంపాదించే ప్రయత్నంలో ఉన్నాడని కామెంట్ చేస్తున్నారు. స్పెక్ట్రా మీడియా పతాకంపై తయారవుతున్న ఈ చిత్రాన్ని పరుచూరి మురళి డైరక్ట్ చేస్తున్నాడు. మరళి గతంలో పెదబాబు, ఆంధ్రుడు చిత్రాలను రూపొందించాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X