Warangal Srinu: అప్పుడు ఆచార్య ఇప్పుడు లైగర్.. కోలుకోలేని నష్టాల్లో నైజాం డిస్ట్రిబ్యూటర్
బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా సక్సెస్ అవుతుంది అనే విషయంలో కొన్నిసార్లు డిస్ట్రిబ్యూటర్ లు తడబడుతూ ఉంటారు. ఈ క్రమంలో అత్యాశకు పోయి ఊహించిన విధంగా కొన్నిసార్లు డిజాస్టర్లు కూడా ఎదుర్కొంటారు. అయితే వరుసగా మాత్రం ఫెయిల్యూర్స్ రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మంచి ట్రాక్ మీద కొనసాగుతున్న ఒక డిస్ట్రిబ్యూటర్ మాత్రం వరుస సినిమాలతో ఊహించిన విధంగా నష్టాలను చూసినట్లుగా తెలుస్తోంది. అతను మరెవరో కాదు వరంగల్ శ్రీను. ఇక ఇటీవల కాలంలో అతను వరుస సినిమాలతో ఫ్లాప్ ఎదుర్కొన్నాడు. ఆ సినిమాలపై ఒక లుక్కేస్తే..

నైజాం డిస్ట్రిబ్యూటర్ గా
ఆ మధ్యకాలంలో క్రాక్ సినిమా విడుదల సమయంలో ఎక్కువగా హడావిడిగా కనిపించిన డిస్ట్రిబ్యూటర్లలో వరంగల్ శ్రీను ఒకరు. నైజాం ఏరియాలో దిల్ రాజుకి పోటీగా నిలబడి డిస్ట్రిబ్యూటర్ గా కొన్ని సినిమాలతో మంచి లాభాలను అందుకున్నాడు. ముఖ్యంగా ఆయన ప్రముఖ నిర్మాత దిల్ రాజు పై చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. థియేటర్స్ దొరక్కుండా చేస్తున్నారు అని దిల్ రాజు పై ఊహించిన విధంగా కామెంట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

అలా వరుస విజయాలు
ముఖ్యంగా అతనికి ఇస్మార్ట్ శంకర్, క్రాక్ సినిమాలు మంచి విజయాన్ని అందించాయి. ఆ సినిమాలు పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్ అందించడంతో వరంగల్ శ్రీను రేంజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతకుముందు వరకు కొన్ని చిన్న సినిమాలతో డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ వచ్చిన వరంగల్ శ్రీనివాస్ ఆ సినిమాతో మాత్రం మంచి లాభాలను అందుకొని మిగతా సినిమాలపై కూడా పెట్టుబడి పెట్టాడు. ఇక నాంది సినిమా కూడా అతనికి మంచి ప్రాఫిట్ అందించింది.

వరుస డిజాస్టర్స్
అయితే అప్పటివరకు అతనికి మంచి సక్సెస్ ట్రక్ వచ్చినప్పటికీ 2022వ సంవత్సరం మాత్రం ఊహించని నష్టాలను కలిగించింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాకు కాస్త నష్టాలు తగ్గించే విధంగా దర్శకుడు హీరోలు హెల్ప్ చేసినప్పటికీ కూడా అదేమంత పెద్దగా ఉపయోగపడింది కాదు. ఇక తర్వాత పెద్దగా హైప్ క్రియేట్ చేయలేకపోయినా విరాటపర్వం సినిమా కూడా వరంగల్ శ్రీను బిజినెస్ ను బాగానే దెబ్బకొట్టింది.

లైగర్ తో మరో దెబ్బ
ఇక వరంగల్ శ్రీను భారీ పెట్టబడితో లైగర్ సినిమా నైజాం హక్కులను కొనుగోలు చేశాడు. ఇంతకుముందు పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా భారీ స్థాయిలో ప్రాఫిట్ అందుకున్న వరంగల్ శ్రీను ఈసారి కూడా ఆ దర్శకుడి మీద నమ్మకంతో లైగర్ హక్కులను భారీగా కొనుగోలు చేశాడు. కానీ సినిమా ఊహించని విధంగా నష్టాలను అయితే కలిగించే దిశగా కొనసాగుతోంది.

100 కోట్ల నష్టం
2002 వరంగల్ శ్రీనుకు ఏమాత్రం కలిసి రాలేదు. అతను జడ్జిమెంట్ పూర్తిస్థాయిలో ట్రాక్ తప్పడంతో నష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఈమధ్య విక్రాంత్ రోనా సినిమా కాస్త ప్రాఫిట్ అందించినప్పటికీ అదేమీ ఇటీవల కాలంలో వచ్చిన నష్టాలను బ్యాలెన్స్ చేసేంత పెద్దది కాదు. ఇక మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు వరంగల్ శీనుకు దాదాపు 100 కోట్ల వరకు నష్టాలను చూసినట్లు సమాచారం. మరి తదుపరి సినిమాలతో అయినా వరంగల్ శీను ట్రాక్లోకి వస్తారా? లేదా ఇంతటితో డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ ని వదిలేస్తారా? అనేది కాలమే సమాధానం చెప్పాలి.


Click it and Unblock the Notifications











