నైజాం : 10 కోట్ల క్లబ్‌లో ‘జులాయి’
హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-ఇలియానా జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'జులాయి' చిత్రం నైజాంలో రూ. 10 కోట్లు వసూలు చేసిన సినిమాల జాబితాలో చేరింది. నిన్నటికి రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం 10 కోట్ల మార్కును దాటింది. అల్లు అర్జున్ కెరీర్లో ఇదే నైజాంలో హయ్యెస్ట్ కలెక్షన్. 2007లో వచ్చిన దేశ ముదురు చిత్రం నైజాంలో అత్యధికంగా రూ. 9.5 కోట్లు వసూలు చేసింది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై డివివి దానయ్య సమర్పణలో ఎన్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ బ్యాంకు దోపిడీ సంఘటన చుట్టూ సాగే ఈ చిత్రంలో బన్నీ అద్భుతంగా నటించడంతో పాటు యాక్షన్ సీన్లు ఇరగదీశాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్లస్సయింది.
జులాయి మలయాళ వెర్షన్ 'గజ పోకిరి' ఈనెల ఓనం పండుగ సందర్భంగా 18న విడుదల చేసారు. ఈ చిత్రం అక్కడ కోటి ఇరవై లక్షలుకు అమ్ముడైంది. ఆర్య 2, బద్రీనాధ్ చిత్రాలు కోటి రూపాయలు పైగా బిజినెస్ చేయటంతో ఈ క్రేజ్ వచ్చింది. ఇప్పటికే ఈచిత్రం దాదాపు 50 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు తెలుస్తోంది.
ఈచిత్రం తర్వాత బన్నీ-పూరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై'ఇద్దరమ్మాయిలతో...'. పేరుతో గణేష్ బండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రారంభం కానుంది. దర్శకుడు పూరీ జగన్నాధ్ దేశముదురు తర్వాత బన్నీ కాంబినేషన్‌లో చేస్తున్న చిత్రం. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత బండ్ల గణేష్, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పూరీ జగన్నాధ్.


Click it and Unblock the Notifications











