Mahesh babu సర్కారు వారి పాటకు మరో షాక్.. కలెక్షన్స్ పై ప్రభావం?

సర్కారు వారి పాట సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మహేష్ బాబు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడని, అంతేకాకుండా ఆయన కెరీర్లోనే ఇదొక పెద్ద సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో నమ్మకంగా తెలిపారు. అయితే ప్రస్తుతం సినిమాకు వస్తున్న టాక్ చూస్తే రిజల్ట్ విషయంలో అనుమానాలు కూడా వస్తున్నాయి. ఓ వర్గం వారికి బాగానే నచ్చినప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఈ సినిమా అంచనాలను అందుకోలేక పోయినట్లుగా తెలుస్తోంది. అయితే కొంత ఆ ప్రభావం సినిమాపై గట్టిగానే పడడంతో ప్రస్తుతం కలెక్షన్స్ అనుకున్నంతగా రావడం కూడా కష్టమే అనిపిస్తుంది.

మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా 14 రీల్స్ సహ నిర్మాతగా వ్యవహరించారు. గీత గోవిందం సినిమా తర్వాత దర్శకుడు పరశురామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా.. మహేష్ బాబు తో తెరకెక్కించిన ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అవుతుంది అని నమ్మకంతో చెప్పారు. కానీ ప్రస్తుతం సినిమాకు వచ్చిన టాక్ చూస్తే ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేదని తెలుస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్ విషయంలో అయితే ఓ వర్గం ప్రేక్షకులు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

No advance bookings on mahesh babu sarkaru vaari paata

మొన్న ఆచార్య ఇప్పుడు సర్కారు వారి పాట అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చాలావరకు తగ్గిపోయాయి. అసలైతే మహేష్ బాబు సినిమా విడుదల అవుతుంది అంటే మొదటి రోజే అడ్వాన్స్ బుకింగ్స్ తో థియేటర్స్ హౌస్ ఫుల్ గా దర్శనమిస్తాయి. కానీ హైదరాబాద్లోని ప్రముఖ థియేటర్లలో సినిమా థియేటర్లు సగం వరకు ఖాళీగానే ఉన్నట్లు ఆన్లైన్లో బుకింగ్స్ చూస్తేనే అర్థమవుతుంది.

మార్నింగ్ షోలకు హౌస్ ఫుల్స్ పడినప్పటికి ఫస్ట్ షో సెకండ్ షో కలెక్షన్స్ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక శుక్రవారం అడ్వాన్స్ బుకింగ్ అయితే పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో కొనసాగితే మాత్రం శని ఆదివారాల్లో కలెక్షన్స్ రావడం కష్టంగా మారుతుంది. ప్రేక్షకులు తప్పకుండా డైరెక్టర్ హీరో మహేష్ బాబు దృష్టిలో పెట్టుకుని థియేటర్ లోకి వస్తారు. అయితే వారి స్థాయికి తగ్గట్టుగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోతే మాత్రం బాక్సాఫీస్ వద్ద లాభాలు రావడం అసాధ్యం.

Recommended Video

Sarkaru Vaari Paata Review మూవీ లో హైలైట్స్ ఇవే | Filmibeat Telugu

ఏది ఏమైనా కూడా సర్కారు వారి పాట సర్కారు వారి పాట అంచనాలకు తగ్గట్టుగా లేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఓవర్సీస్లో మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఇప్పటికే 1 మిలియన్ల డాలర్లు వచ్చినట్లు సమాచారం. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనుకున్నంత స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో టిక్కెట్ల రేట్లు కూడా కాస్త ఎక్కువగా ఉండటం వలన ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఆ ప్రభావం కూడా గట్టిగానే పడవచ్చు. మరి సర్కారు వారి పాట మొత్తంగా మొదటి రోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X