మంచి నిర్ణయం : దసరాకు భారీ చిత్రాలు దూరం

By Srikanya

బెంగళూరు : చిన్న సినిమాను బ్రతికించాలంటే ముందు దానికి థియోటర్స్ దొరికేలా చేయగలగాలి. ముఖ్యంగా పండుగల రోజుల్లో వాటిని విడుదల చేయటానికి ఎప్పుడూ అవకాశం దొరకటం లేదు. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవటానికి పెద్ద సినిమాలు వరస కడుతూంటాయి. దీనిని నివారించటానికి కన్నడ పరిశ్రమ ఓ నిర్ణయం తీసుకుంది. ఒకదాని వెంట ఒకటిగా భారీ చిత్రాలు విడుదల కావడంతో కాస్తంత విరామం ప్రకటించారు. ఈ కారణంగా దసరాకు పెద్ద సినిమాల విడుదలను వాయిదా వేశారు.

థియేటర్ల సమస్య కూడా ఇందుకు కారణం. ఇటీవలి కాలంలో భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాల్ని ఏకంగా 200కు పైగా థియేటర్లలో విడుదల చేస్తుండడం వల్ల థియేటర్ల లభ్యత సమస్యగా మారింది. మాణిక్య (తెలుగులో మిర్చి), పవర్‌ స్టార్‌ (తెలుగులో దూకుడు), దృశ్య (తెలుగులో దృశ్యం), పరమశివ (తమిళంలో సముద్రం), తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ (తెలుగులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌), అధ్యక్ష సినిమాలు విజయవంతంగా ప్రదర్శిస్తుండడంతో వాటిని తొలగించే అవకాశం లేదు. సినిమా హాళ్ల సమస్య మరింత తీవ్రమైంది.

పరస్పరం పోటీపడకుండా సినిమా విడుదలైన తరువాత కనీసం మూడు వారాల వరకు మరో సినిమా (భారీ బడ్జెట్‌)ను విడుదల చేయరాదని నిర్మాతలు అలిఖిత ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దసరా సందర్భంలో పెద్ద సినిమాలు దూరంగా ఉన్నందున ఇదే అదనుగా చిన్న నిర్మాతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దసరాకు ముందుగానే సూపర్‌స్టార్‌ ఉపేంద్ర సినిమా విడుదల కానుంది. తెలుగులో విజయం సాధించిన 'కిక్‌' రీమేక్‌గా రూపొందిన 'సూపర్‌ రంగ' సినిమా ఈ వారం విడుదల చేస్తున్నారు.

ప్రముఖ నటుడు దేవరాజ్‌ నిర్మాతగా రూపొందించిన 'నీనాదెనా' సినిమా దసరా కానుకగా విడుదల కానుంది. దునియా విజయ్‌, ఐశ్వర్య (నటి జయమాల కుమార్తె) జంటగా నటించిన 'సింహాద్రి' వచ్చేనెల రెండున విడుదల చేయాలని సంకల్పించారు. మూడేళ్లుగా వివిధ కారణాల వల్ల వాయిదాపడుతూ వచ్చిన 'ఉసిరిగింత నీనే హత్తిర' సినిమా కూడా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

No Big Movies for Dasara Season

హ్యాట్రిక్‌ హీరో శివరాజ్‌కుమార్‌ నటించిన 'బెళ్లి' సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఎప్పుడు విడుదల చేసేదీ ఇంకా నిర్ణయించలేదు. గోల్డెన్‌స్టార్‌ గణేష్‌ సినిమా ఖుషీఖుషీగా, ప్రేమ్‌ సినిమా ఫెయిర్‌ అండ్‌ లవ్లీ, నమస్తే మేడమ్‌ (తెలుగులో మిస్సమ్మ) సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్ల లభ్యతపై విడుదల తేదీల్ని ఖరారు చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X