నాని సినిమాకి బిజినెస్ కావటం లేదు

By Srikanya

అలా మొదలైంది చిత్రం విజయంతో నాని పూర్తి బిజీ అయ్యిపోయాడు. అయితే వెంటనే 'సెగ' సినిమా వచ్చేసి ఆ క్రేజ్ మొత్తం క్లియర్ చేసేసింది. దాంతో అతని తర్వాత చిత్రం 'పిల్ల జమీందార్' కి అస్సలు బిజినెస్ అనేది లేకుండా పోయింది. ఈ సినిమాలో నాని సరసన హరిప్రియ, బిందుమాధవి హీరోయిన్లు. ఆ ఇద్దరూ సాధారణ తారలే కావడం గమనార్హం. భూమిక నిర్మించిన ఫ్లాప్ సినిమా 'తకిట తకిట' ద్వారా హరిప్రియ పరిచయం కాగా, నాలుగైదు సినిమాలు చేసినా ఒక్కటీ హిట్టులేని తార 'బిందుమాధవి'. ఇలాంటి తారలతో నటిస్తున్నందువల్ల ఈ సినిమా పట్ల బిజినెస్ వర్గాలు పెద్దగా ఆసక్తి కనపరచడం లేదని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

శ్రీ శైలేంద్ర సినిమాస్ బేనర్‌పై డి.ఎస్. రావు ఈ సినిమా నిర్మిస్తున్నారు. "జమీందారుగా నటిస్తున్న నాగినీడు ('మర్యాద రామన్న' ఫేం), ఆయన మనవడు 'పిల్ల జమీందార్'గా నటిస్తున్న నాని మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి' అని ఆయన చెప్పారు.ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన సంగతేమంటే అవసరాల శ్రీనివాస్ ఓ కీలక పాత్ర చేస్తుండటం. 'అష్టా చెమ్మా' ద్వారానే నాని, శ్రీనివాస్... ఇద్దరూ పరిచయమయ్యారు. తిరిగి వాళ్లు కలిసి చేస్తున్న సినిమా ఇది. ఇప్పటికే నాని వ్యవహార శైలి పట్ల సినీ వర్గాలు పెదవి విరుస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'పిల్ల జమీందార్' హిట్టయితేనే అతనికి విలువ. లేదంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చే ఈగ కోసం ఎదురుచూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X