క్రేజ్ ఉంది..కొనేవాళ్లు కరువయ్యారు
చెన్నై : ఈ దీపావళి వందలాది కోట్ల రూపాయలతో వెండితెర వినోదాన్ని పంచనుంది. రూ.180 కోట్లతో శంకర్ దర్శకత్వంలో విక్రం హీరోగా తెరకెక్కిన 'ఐ' చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఆస్కార్ ఫిలిమ్స్ అధినేత రవిచంద్రన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం బిజనెస్ మాత్రం జరగటం లేదని తెలుస్తోంది. నిర్మాత చెప్పిన రేట్లు బాగా ఎక్కువ ఎనిపించటంతో క్రేజ్ ఉన్నా కొనటానికి వెనకంజ వేస్తున్నారని చెన్నై వర్గాలు సమచారం. తెలుగు రైట్స్ సైతం ఇప్పటికీ ఫైనలైజ్ కాలేదని అంటున్నారు.
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా.. భారీస్థాయిలో విడుదలవుతోంది. దీంతో అంతకన్నా ముందే దీపావళి రేసులో ఉన్న 'కత్తి', 'పూజై' చిత్రాలు వాయిదా పడినట్లు కోలీవుడ్ టాక్. అయితే తాము తప్పకుండా వస్తామని.. 'ఐ'కి గట్టి పోటీ ఇస్తామని ఈ చిత్రాలు చెబుతున్నాయి. దాంతో ఈ చిత్రాల నుంచి కూడా పోటీ ఉండటం కూడా మనోహరుడుకి మైనస్ గా మారింది.

ఇటీవల జరిగిన 'పూజై' చిత్ర మీడియా...సమావేశం విశాల్ మాట్లాడుతూ.. హరి దర్శకత్వంలోని 'పూజై' సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను సొంత బ్యానరుపై నిర్మించా. ఎట్టి పరిస్థితుల్లోనూ దీపావళికి తప్పకుండా విడుదల చేస్తానని చెప్పారు. తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులోనూ విడుదలకు సిద్ధమైందని విశాల్ అన్నారు.
మరో ప్రక్క దర్శకుడు శంకర్‌తో పోటీ పడేందుకు ఏఆర్ మురుగదాస్ 'కత్తి'ని సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాను కూడా ఎట్టిపరిస్థితుల్లో దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో విజయ్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన 'తుప్పాక్కి' భారీ హిట్‌ను సొంతం చేసుకోవడంతో మళ్లీ అదే సెంటిమెంట్‌ను నమ్ముతున్నారు మురుగదాస్. దీంతో ఈ దీపావళి ఏకంగా రూ.300 కోట్ల పైచిలుకు వినోదాన్ని అందించేందుకు కోలీవుడ్ సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











