twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    No Time to Die worldwide collections: జేమ్స్‌బాండ్‌కు ముఖం చాటేసిన ప్రేక్షకులు.. అతి దారుణంగా కలెక్షన్లు

    |

    ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను ఆకట్టుకొన్న ఐకానిక్ క్యారెక్టర్ జేమ్స్ బాండ్ తాజాగా నో టైమ్ టూ డై అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాపై ప్రేక్షకులు పెదవి విరిచినట్టు స్పష్టమైంది. గతంలో సాధించిన కలెక్షన్లతో పోల్చుకొంటే నో టైమ్ టూ డై అనే చిత్రం దారుణమైన రెస్పాన్స్‌ను కూడగట్టుకొంటుంది. అయితే తొలి రోజు ఈ చిత్రం సాధించిన కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే...

     ఐర్లాండ్, యూకేలో భారీ స్పందన

    ఐర్లాండ్, యూకేలో భారీ స్పందన

    అయితే ప్రపంచవ్యాప్తంగా నో టైమ్ టూ డై చిత్రానికి పెద్దగా స్పందన కనిపించకపోయినా యూకే, ఐర్లాండ్‌లో భారీ స్పందన వ్యక్తమైంది. తొలి రోజు నాలుగు రోజులకు 1.62 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోవడం జేమ్స్ బాండ్ సినిమాకు క్రేజ్‌ను చెప్పింది. అర్దరాత్రి స్క్రీనింగ్‌కు దాదాపు 30 వేల మంది ప్రేక్షకులు తరలివచ్చారు. గత జేమ్స్ బాండ్ సినిమా స్పెక్ట్రేతో పోల్చుకొంటే 12 శాతం ఎక్కువ అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

     యూకేలో 772, కొరియాలో 2167 స్క్రీన్లలో

    యూకేలో 772, కొరియాలో 2167 స్క్రీన్లలో

    నో టైమ్ టూ డై చిత్రం యూకేలో 772 థియేటర్లలో రిలీజైంది. ఒక కోరియాలో 2167 స్క్రీన్లలో ఈ సినిమాను ప్రదర్శించారు. కొరియాలో ఈ చిత్రం తొలి రోజు 665000 డాలర్ల మేర వసూళ్లను సాధించింది. మెక్సికోలో 300000 డాలర్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమా కలెక్షన్లు గత చిత్రం ది స్కై వాకర్ కంటే 25 రెట్లు ఎక్కువ అంటూ ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

    తొలి రోజున యూకే, ఐర్లాండ్‌లో

    తొలి రోజున యూకే, ఐర్లాండ్‌లో

    ఇక బ్రిటన్‌లో నో టైమ్ టూ డై చిత్రం తొలి రోజున 6.8 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, ఐర్లాండ్‌లో 6.2 మిలియన్ డాలర్లు రాబట్టింది. అయితే యూకేలో జేమ్స్ బాండ్ చిత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. స్కైఫాల్ కలెక్షన్లతో పోల్చుకొంటే 26 శాతం, స్పెక్ట్రే కంటే 13 శాతం తక్కువ అంటూ ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

     ఇండియాలో తొలి రోజున ఎంతంటే

    ఇండియాలో తొలి రోజున ఎంతంటే

    అలాగే ఇండియా విషయానికి వస్తే.. నో టైమ్ టూ డై చిత్రం తొలి రోజున రూ.2.25 కోట్లు రాబట్టింది. గత చిత్రాలతో పోల్చుకొంటే చాలా తక్కువగా వసూళ్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటలీ, బ్రెజిల్, జర్మనీ, నెదర్లాండ్ దేశాల్లో చిత్రానికి మంచి ఓ మోస్తారు స్పందన లభించింది. జెమ్స్ బాండ్ సిరీస్‌లో ఇది చివరి చిత్రం కావడంతో ప్రేక్షకులు ఎక్కువ అటెన్షన్ చూపించడం కనిపించింది.

    ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు అంచనా...

    ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు అంచనా...

    ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లను పరిగణనలోకి తీసుకొంటే.. నో టైమ్ టూ డై చిత్రం గత రెండు రోజుల్లో 22 మిలియన్ డాలర్లను సొంతం చేసుకొన్నది. తొలి రోజున ఈ చిత్రం 7 మిలియన్ డాలర్లను సొంతం చేసుకొన్నది. అధికారికంగా ఇంకా కలెక్షన్లు వెల్లడి కావాల్సి ఉంది. ఇందులో యూకేలోనే ఎక్కువగా కలెక్షన్లు రాబట్టడం గమనార్హం.

    English summary
    No Time to Die worldwide collections: James bond movie collected 22 million dollars world wide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X