హాట్ టాపిక్ : ‘బాద్‌షా’కి ఎవరూ భయపడటం లేదు
హైదరాబాద్ : సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమా విడుదల అవుతోందంటే మిగతా సినిమాలన్నీ ఎంత పెద్దవైనా రెండు మూడు వారాల వరకూ వాయిదాలు పడతాయి. ఎందుకంటే హిట్ టాక్ వచ్చిందంటే మినిమం మూడు వారాలు పాటు కలెక్షన్స్ అదరకొడతాయి. అంతేకాదు థియోటర్స్ సైతం మిగతా చిత్రాలకు దొరకవు. ఈ నేఫధ్యంలో చిత్రాల విడుదలను పెద్ద సినిమాల విడుదల తేదీలు చూసి పెట్టుకుంటూండటం ఆనవాయితీ. అయితే 'బాద్‌షా' సినిమాకు ఎవరూ భయపడటం లేదు.
ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం 'బాద్‌షా'. కాజల్ హీరోయిన్ . శ్రీనువైట్ల దర్శకుడు. ఈ నెల 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఆ తర్వాత అంటే ఏప్రియల్ 11 వెంకటేష్ షాడో చిత్రం విడుదల ఉంది. ఆ తర్వాత ఏప్రియల్ 19న నాగార్జున గ్రీకు వీరుడు విడుదల ఉంది. అదే రోజున నితిన్...గుండె జారి గల్లంతయ్యిందే చిత్రం విడుదల అవుతోంది. మరో ప్రక్క అల్లు శిరీష్ గౌరవం చిత్రం సైతం ఏప్రియల్ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంటే బాద్షా విడుదలైన తర్వాత వారం నుంచి వరస సినిమా విడుదలలు ఉన్నాయి.
ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్ షా'. ఇక ఈ చిత్రంలో విలన్ గా నెగిటివ్ పాత్రలో యంగ్ హీరో నవదీప్ కనిపించనున్నారు. ఈ పాత్ర సినిమాలో ఊహించని విధంగా సాగి నవ్వులు పండిస్తూ కీలకమై నిలుస్తుంది అంటున్నారు. అలాగే కెరిర్ చివరి దశలో ఉన్న నవదీప్ కు ఈ పాత్ర బూస్ట్ ఇస్తుంది. అతనికి ఈ సినిమా చాలా మైలైజి ఇచ్చి వరస ఆఫర్స్ తెచ్చి పెట్టే విధంగా సాగుతుందని చెప్పుకుంటున్నారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ నిర్మాత బండ్ల గణేష్... సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్ షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్.


Click it and Unblock the Notifications











