Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాక్సాఫీసు వద్ద సత్తా చాటిన రౌడీ సీఎం...‘నోటా’ వరల్డ్ వైడ్ కలెక్షన్!
విజయ్ దేవరకొండ నటించిన తమిళ-తెలుగు చిత్రం 'నోటా' బాక్సాఫీసు వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించింది. రెండు భాషల్లో ఒకేసారి విడుదలవ్వడం మరింత కలిసొచ్చింది. దానికి తోడు సినిమాపై ముందు నుంచీ భారీ అంచనాలు ఉండటంతో తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు దద్దరిల్లింది. దర్శకుడు ఆనంద్ శంకర్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసిన వివరాల ప్రకారం నోటా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ రూ. 14 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.
థియేటర్లను రూల్ చేస్తున్న రౌడీ సీఎం
రౌడీ సీఎం థియేటర్లను రూల్ చేస్తున్నాడు. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 14 కోట్ల గ్రాస్ వసూలైంది అంటూ తాజాగా ఓ పోస్టర్ విడుదల చేశారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చారు. ఇది అతడి తొలి సినిమా అయినప్పటికీ మంచి స్పందన వస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్, వసూళ్లు టాప్
విజయ్ దేవరకొండకు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన క్రేజ్ అంతా ఇంతా కాదు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో అతడి స్టార్ ఇమేజ్ మరింత పెరిగింది. వసూళ్ల పరంగా కూడా ‘నోటా' తమిళనాడు కంటే తెలుగు రాష్ట్రాల్లో టాప్ పొజిషన్లో నిలిచింది. తొలి రోజు ఇక్కడ రూ. 7 కోట్ల గ్రాస్ వసూలూ చేసినట్లు సమాచారం.
తమిళనాడులో ఎంత?
తమిళనాడులో ఈ చిత్రం తొలి రోజు రూ. 2.6 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి పక్క ఇండస్ట్రీకి చెందిన ఒక కొత్త హీరోకు తమిళనాడు ప్రేక్షకులు సాదర స్వాగతం పలికినట్లు స్పష్టమవుతోంది.
ఇతర ప్రాంతాల్లో ఎంత?
కర్నాటకలో కూడా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ తొలి రోజు రూ. 1.55 కోట్లు రాబట్టింది. యూఎస్ఏలో రూ. 1.85 కోట్లు, ఇతర ఏరియాల్లో మొత్తం కలిసి రూ. 1.2 రాబట్టినట్లు సమాచారం.
రీకవరీ అవుతుందా?
‘నోటా' చిన్న బడ్జెట్ మూవీ కావడంతో నిర్మాతకు రికవరీ వెరీ ఈజీ అనే టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ వసూళ్లు బట్టి సినిమా ప్రాఫిట్ జోన్లో ఉంటుందా? లాస్ జోన్లోకి వెళుతుందా? అనేది తేలనుంది. సినిమాకు యావరేజ్ టాక్ ఉండటం, మరో నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ‘అరవింద సమేత' రిలీజ్ ఉండటంతో ట్రేడ్ విశ్లేషకులు సినిమా ఏ మేరకు రాబడుతుంది అని ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.