భంగపడ్డ నిర్మాత... ‘గీత’ దాటని ‘నోటా’ ఫస్ట్‌వీకెండ్ కలెక్షన్స్

Recommended Video

NOTA Records Less Collections

విజయ్ దేవరకొండ హీరోగా తమిళ దర్శకుడు ఆనందర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా చిత్రం 'నోటా' విడుదల ముందు భారీ హైప్ సొంతం చేసుకుంది. అంచనాల హై రేంజిలో ఉన్న కారణంగా ఫస్ట్ డే కలెక్షన్స్ సూపర్బ్ అనేలా ఉన్నప్పటికీ సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో ఆ తర్వాత రోజుల్లో వసూల్లు పడిపోయాయి. దీంతో ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. మరో వైపు ఈ చిత్రాన్ని నిర్మించిన తమిళ్ ప్రొడ్యూసర్ కె.ఇ. జ్ఞానవేల్ రాజా భారీ లాభాలు పొందవచ్చనే ఆశతో... సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సొంతగా విడుదల చేసి భంగపడ్డారు.

ఫస్ట్ డే వసూళ్లు అదిరిపోయాయి, కానీ..

ఫస్ట్ డే వసూళ్లు అదిరిపోయాయి, కానీ..

విజయ్ దేవరకొండ నటించిన గత చిత్రం ‘గీత గోవిందం' బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ‘నోటా' భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ.1 4 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే గీత గోవిందం వసూళ్లను(రూ. 16.40 కోట్లు)ను దాటలేక పోయింది.

మౌత్ టాక్‌తో కలెక్షన్స్ డీలా

మౌత్ టాక్‌తో కలెక్షన్స్ డీలా

తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ‘నోటా' ఫెయిలైంది. క్రిటిక్స్ నుండి కూడా యావరేజ్ రేటింగ్ రావడంతో సినిమాపై నెగెటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది. ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ రూ. 25.50 కోట్లు మాత్రమే వసూలైంది. ఇందులో రూ. 11.50 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైంది.

 భంగపడ్డ నిర్మాత

భంగపడ్డ నిర్మాత

విజయ్ దేవరకొండ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటంతో ‘నోటా' సినిమాను కొనడానికి తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లు రూ. 18 కోట్ల ఆఫర్ చేశారు. ఆంధ్రా రీజియన్‌కు రూ. 12 కోట్లు, తెలంగాణలో రూ. 4 కోట్లు, సీడెడ్ ఏరియాకు రూ. 2 కోట్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే సొంతగా రిలీజ్ చేస్తే ఎక్కువ లాభాలొస్తాయనే ఉద్దేశ్యంతో నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా అమ్మలేదు. అయితే అనుకున్న ఫలితాలు రాక పోవడంతో నిర్మాత భంగపడ్డట్లయింది.

 ‘అరవింద సమేత' సునామీలో రికవరీ కష్టమే

‘అరవింద సమేత' సునామీలో రికవరీ కష్టమే

తెలుగు డిస్ట్రిబ్యూటర్లు ‘నోటా'ను రూ. 18 కోట్లకు కొంటామని చెప్పినా జ్ఞానవేల్ రాజా వినిపించుకోలేదు. సునీల్ నారంగ్, యువి క్రియేషన్ల సహాయంతో సొంతగా విడుదల చేసుకున్నారు. అక్టోబర్ 11న ‘అరవింద సమేత' విడుదల ఉంది. ఈ నేపథ్యంలో ‘నోటా' పికప్ అవ్వడం కష్టమే అని డిస్ట్రిబ్యూటర్ విశ్వేశ్వర రావు చెప్పినట్లు ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X